కొడాలి నాని క‌న్వెన్ష‌న్ హాలులో ఆ రోజు ఏం జ‌రిగింది అన్న‌ది వ‌ర్ల రామ‌య్య తో స‌హా ఇంకొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.ముఖ్య‌మంత్రి మాత్రం త‌ప్పు చేస్తే ఎంతటి వారిని అయినా శిక్షిస్తామ‌ని ఓ డైలాగ్ కూడా చెప్ప‌డం లేదు.ఒంగోలు కేంద్రంగా ఓ మామూలు వైసీపీ కార్య‌క‌ర్త సుబ్బారావు గుప్తా మాత్రం ఇదంతా పార్టీ ప‌రువు తీయ‌డానికి మాత్ర‌మే జ‌రుగుతున్న ప‌రిణామమ‌ని, మంత్రి నానిని కంట్రోల్ చేయాల‌ని సీఎంకు 72 గంట‌ల గ‌డువు కూడా  ఇచ్చారు. అయినా కూడా ఈ వివాదంపై దుమారం రేగుతూనే ఉంది.ఐదు వంద‌ల కోట్లు చేతులు మారాయ‌ని, పేకాట క్ల‌బ్బుల‌కూ అదేజోరులో డ‌బ్బులు త‌ర‌లిపోయాయ‌ని గుడివాడ ఇష్యూపై టీడీపీ ఆరోపిస్తోంది. ఇవ‌న్నీ విని కూడా మంత్రి నాని య‌థావిధిగా చంద్ర‌బాబును తిట్టిపోస్తున్నారే త‌ప్ప‌! ద‌ర్యాప్తును తాము స్వాగ‌తిస్తామ‌ని, స‌హ‌క‌రిస్తామ‌ని కూడా మాట మాత్రంగానైనా చెప్ప‌లేక‌పోతున్నారు.పండ‌గ రోజుల్లో ఏం జ‌రిగిందో ఇప్ప‌టికీ పోలీసులు తేల్చ‌లేక‌పోతున్నారు.రాజ‌కీయ ఒత్తిళ్ల కార‌ణంగానే గుడివాడ క‌థ పెద్ద‌గా ముందుకు సాగ‌డం లేద‌ని కూడా తేలిపోయింది.దీంతో టీడీపీ తాజాగా కొన్ని ఆరోప‌ణ‌ల‌తో మీడియా ముందుకు వ‌చ్చింది. ఛీర్ గాళ్స్ ను ఇక్క‌డికి తీసుకువ‌చ్చార‌ని,అందుకు త‌గ్గ వివ‌రాలు ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని,వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేయాల‌ని వేడుకుంటున్నారు.
 
గుడివాడ సందుల్లో ఏమ‌యింది ఆ రోజు.సంక్రాంతి పండుగ రోజు వివాదాల‌కు అస‌లు కార‌ణం ఏంటి? ఎక్క‌డి నుంచో అమ్మాయిలు ఇక్క‌డికే ఎందుకు వ‌చ్చారు.ప్ర‌శాంతమ‌యిన వాతావర‌ణంలో ఛీర్ గాళ్స్ చిందులెందుకు వేశారు? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లు..స‌మాధానం చెప్పాల‌ని కోరుతున్నాయి టీడీపీ వ‌ర్గాలు.మ‌రోవైపు త‌న‌కేమీ తెలియ‌ద‌ని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు.తాను అక్క‌డి కొంద‌రు నృత్యాలు చేస్తుంటే ఆపాను త‌ప్ప త‌న‌కు చెందిన క‌న్వెన్ష‌న్ హాల్ లో టీడీపీ ఆరోపిస్తున్న విధంగా క్యాసినో కానీ క్యాబ‌రే కానీ జ‌ర‌గ‌నే లేద‌ని మంత్రి చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ లీడ‌ర్ వ‌ర్ల రామ‌య్య ఆరోప‌ణ‌లు మ‌రో విధంగా ఉన్నాయి.పండగ రోజుల్లో గుడివాడ‌కు ఛీర్ గాళ్స్ వ‌చ్చార‌ని, గ‌న్నవ‌రం నుంచి బెంగ‌ళూరు, బెంగ‌ళూరు నుంచి గోవా, గోవా నుంచి విజ‌య‌వాడ మీదుగాఆ రోజు రాక‌పోక‌లు సాగించిన ఛీర్ గాళ్స్ వివ‌రాలు వ‌ర్ల విలేక‌రుల‌కు వివ‌రించారు.ఆ రోజు మొత్తం 13 మంది అమ్మాయిలు ఇక్క‌డికి వ‌చ్చార‌ని,వీటి వివ‌రాలు పోలీసులు సేక‌రిస్తే ఈ కేసును ఛేదించ‌డం సులువు అవుతుంద‌ని వ‌ర్ల రామ‌య్య చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: