కమలనాదుల డిమాండ్లు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కాపులకు రిజర్వేషన్ అనే సరికొత్త డిమాండ్లు వినిపిస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటివరకు కాపు రిజర్వేషన్ ఉద్యమంపై సర్వహక్కులు ముద్రగడ పద్మనాభంకు మాత్రమే ఉండేవి. అలాంటిది ముద్రగక హక్కులను లాగేసుకోవాలని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటు డిమాండ్ చేశారు.




పైగా తన డిమాండ్ కు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటున్నారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కాపులకు కూడా 5 శాతం రిజర్వేషన్లు ఎందుకివ్వరో చెప్పాలంటు వీర్రాజు లా పాయింట్ లాగారు. ఇక్కడే వీర్రాజు వెర్రితనం కనబడుతోంది. రిజర్వేషన్లన్నవి కేంద్రం పరిధిలో ఉండే అంశమని తెలీదా ? ఇంతకుముందు చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారో వీర్రాజుకు అంతమాత్రం తెలీదా ? 




కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేక చంద్రబాబు చేతులెత్తేశారు. అయితే తర్వాతెపుడో ఓబీసీలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అందులో 5 శాతం చంద్రబాబు కాపులకు కేటాయించారు. అయితే ఆ నిర్ణయాన్ని సుప్రింకోర్టు కొట్టేసిందని వీర్రాజుకు గుర్తులేదా ? కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ది ఉంటే వీర్రాజు డిమాండ్ చేయాల్సింది నరేంద్రమోడీనే కానీ జగన్ను కాదని అర్ధమైపోవటంలేదా ?  తెలంగాణాలో పార్టీ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వంపై ఎలా గోల చేస్తున్నారో అలాగే తాను కూడా చేయాలని అనుకుంటున్నారో ఏమో.




ఏదేమైనా కాపు రిజర్వేషన్లనే తేనెత్తుట్టెను వీర్రాజు కదిలించాలని అనుకున్నారు. ఈ నెపంతో కాపులందరినీ వైసీపీకి దూరం చేయాలని ప్లాన్ చేశారు. ముస్లింలక రిజర్వేషన్లంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించాయి. కానీ కాపులకు రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించలేదు. కాబట్టి వీర్రాజు ఎంత అరిచి గీపెట్టినా జగన్ ఏమాత్రం పట్టించుకోడు. ఈ విషయాలు తెలిసే ముడ్రగడ అలిసిపోయి కూర్చున్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేసే దమ్ములేని వీర్రాజు రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. మరి వీర్రాజు హైజాక్ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: