సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. అది ఆటోమొబైల్ రంగంలోని ఒక పెద్ద సంచలనం.. ఇక ఈ రంగంలోని మిగతా కంపెనీలన్నీ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాయ్. ఇలా ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించింది ఏంటో తెలుసా నానో కారు. టాటా కంపెనీ అతి తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నానో కారు తయారు చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైనదిగా కూడా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఇక ఈ కారు మార్కెట్లోకి రావడంతో ఎంతో మంది సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.


 ప్రతి ఒక సామాన్యుడికి కారు కొనుగోలు చేయాలని కల నెరవేర్చే విధంగానే ప్రస్తుతం నానో కారు ధరలు ఉన్నాయి అంటూ ఆనందంలో మునిగిపోయారు. ఇక ఎంతోమంది ఈ కారును కొనుగోలు చేశారు. అయితే క్రమక్రమంగా ఈ కారు ఉనికిని కోల్పోయి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై పోయింది అని చెప్పాలి. అయితే  జనాలకు నానో కారు ఒక సాదాసీదా కారు అయినప్పటికీ ఈ కార్లను తయారు చేయడానికి ముఖ్య కారణమైన టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటాకు నానో కారు ఎంతో ప్రత్యేకమైనదని చాలామందికి తెలిసిందే. ఇటీవలే నానో కారు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రతన్ టాటా. ఈ కారును రూపొందించేందుకు వెనుక ప్రేరణ ఏంటి అన్న విషయాలు చెప్పుకొచ్చారు.


 నానో కార్ లాంటి వాహనాలను తయారు చేయాలి అన్న కోరిక వెనక ఒక గొప్ప ప్రేరణ ఉంది అంటూ తెలిపారు రతన్ టాటా. చాలా కుటుంబాలు తరచూ పిల్లలతో స్కూటర్ పై వెళ్లడాన్ని చూస్తూ ఉండేవాడిని.. ఆ సమయంలో తల్లిదండ్రులు మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారు అనిపించేది. గుంతలుగా  ఉన్న రోడ్లపై  అలాగే ప్రయాణించడం చూసి గుండె తరుక్కుపోయింది. ఆ సమయంలోనే ఒక ఆలోచన తట్టింది.  ముందు వీల్స్ భద్రంగా  మార్చాలని దృష్టి పెట్టి ఆ తర్వాత నాలుగు చక్రాల ఉండి కిటికీలతో  బంగీ లాంటి వాహనాలను రూపొందించాలి అనుకున్నాం.. కానీ చివరికి కారును తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నాం. నానో కారు ఎప్పటికీ ప్రజల కోసమే అని రతన్ టాటా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: