డ్రాగన్ శాస్త్రవేత్తలు భయంకరమైన వైరసులను కనుగొన్నారు. చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హూనాన్ లో సైంటిస్టులు గతంలో ఎప్పుడూ చూడని ఎనిమిది  రకాల వైరసులను కనుక్కున్నారని బయటపడింది. ద్వీపంలో ఉన్న ఎలుకల్లో ఈ వైరసులు బయటపడ్డాయి. ఎలుకలనుండి మనుషులకు  ఈ వైరసులు చాలా స్పీడుగా సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.





శాస్త్రవేత్తల తాజా హెచ్చరికలతో ప్రపంచం ముందు మరికొన్ని  వైరసుల ముప్పు పొంచి ఉందన్న విషయం అర్ధమవుతోంది. 2019లో బయటపడిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతునే ఉంది. చైనా లోని వూహాన్ ల్యాబులో  బయటపడిన కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని  చుట్టబెట్టేసింది. కరోనా వైరస్ దెబ్బకు దేశదేశాలు అతలాకుతలం అయిపోయాయి. తర్వాత కరోనా వైరస్ లోనే ఆల్ఫా అని బీటా  అని రకరకాల వెర్షన్లు బయటపడ్డాయి.





చివరకు ఒమిక్రాన్ రూపంలో కూడా కరోనా వైరస్ ప్రపంచ జనాలను తీవ్రభయాందోళనలకు గురిచేసింది. తమ పరిశోధనల్లో భాగంగా సైంటిస్టులు 700 ఎలుకల నమూనాలను పరిశీలించారు. ఈ నమూనాల్లో ఎనిమిది భయంకరమైన వైరసులున్నట్లు  శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తాజాగా బయటపడిన వైరసులు మనుషుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇంకా అధ్యయనం చేయాల్సుంటుందని ఒక సైంటిస్టు డాక్టర్ షీ జెంగ్లీ అభిప్రాయపడ్డారు. వైరోలాజికా సినికా అనే ల్యాబ్ చైనా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్ కి అనుబంధంగా పనిచేస్తుంది.





ఈ ల్యాబులో కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు నిర్విరామంగా పనిచేస్తుంటారు. ఇపుడు ఎలుకల్లో బయటపడిన వైరసులు మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా తయారవుతాయని ప్రాధమికంగా  శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఏ రూపంలో హానికరమవుతాయి, సోకిన తర్వాత బయటపడే లక్షణాలు ఏమిటి ? ఎలా గురించాలి ? దానికి విరుగుడుగా పనిచేసే వ్యాక్సిన్ ఏమిటి ?  లాంటి విషయాలపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈలోపు కరోనా వైరస్ లాగ ల్యాబ్ నుండి కొత్త వైరస్ బయటపడి ప్రపంచ దేశాలను వణికించకుండా ఉంటే అదే పదివేలని ఇపుడు అన్నీ దేశాలు ప్రార్ధనలు మొదలుపెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: