సాధారణంగా రాజకీయాలలో సెంటిమెంట్లను కాస్త ఎక్కువగానే ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఏదైనా అంశం కలిసి వచ్చింది అంటే చాలు ఇక ఆ తర్వాత కూడా అదే రిపీట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారూ నాయకులు. అదే సమయంలో ఇక ఎన్నికల్లో  మరికొన్ని విషయాలు కూడా కొన్నిసార్లు అభ్యర్థులకు కలిసి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపికి ఇలాగే కలిస రాబోతుంది అంటూ ఒక ప్రచారం తెరమీదకి వచ్చింది .


 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో హవా కొనసాగిస్తుంది. అప్పటికే రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. అలాంటి సమయంలో అసలు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలుస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు  అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కిషన్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఇక ఈ విజయంతో అందరూ షాక్ లో మునిగిపోయారు  ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండే ఏడు నియోజకవర్గాలలో కూడా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు . ఏకంగా ఆరు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే ఇక నాంపల్లిలో మాత్రం ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఎంఐఎం కూడా అటు బిఆర్ఎస్కు మిత్రపక్షమే అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలా పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్, బిఆర్ఎస్ అనుకూల పార్టీ అధికారంలో ఉన్న.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపి విజయం సాధించింది. అయితే ఇక ఇప్పుడు కూడా ఇలాంటి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అంటే అవును అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 లాగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లోని ఆరు నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఒక నియోజకవర్గంలో ఎంఐఎం విజయం సాధించాయి. ఇక ఇప్పుడు మరోసారి బిజెపి తరఫున కిషన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. కిషన్ రెడ్డికి ప్రత్యర్థులుగా కాంగ్రెస్, టిఆర్ఎస్ నుండి  బలమైన అభ్యర్థులు కూడా లేరు. దీంతో మరోసారి 2019 నాటి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని పార్లమెంట్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నుండి గెలిచేది బిజెపినే అంటూ ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp