ఏపీలో మూడు రాజకీయ పార్టీల కలయికే ఓ ఆసక్తికర పరిణామం. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు టీడీపీని తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఎందుకు ఆహ్వానం పలికారు? కూటమి నుంచి ఓసారి వైదొలిగిన పార్టీని తిరిగి ఎందుకు చేర్చుకున్నారు వంటి అంశాలపై ప్రధాని మోదీ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పుకొచ్చారు.


ఈ సారి ఎన్డీయే కూటమికి 400 ఎంపీ స్థానాలు గెలవడం కాదు. ఇవన్నీ మా దగ్గరే ఉన్నాయంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇప్పటికిప్పుడు 360 ఎన్డీయే దగ్గర 360 సీట్లు ఉన్నాయని వివరించారు. బీజేడీతో పాటు మిగతా పార్టీలను కలుపుకొంటే ఈ బలం  400కి పైగా చేరుతుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో టీడీపీతో పొత్తు వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించడం తమ సిద్ధాంతమన్నారు మోదీ.

బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నా సరే ఏపీలో టీడీపీని చేర్చుకున్నాం. మహా రాష్ట్రలో శివసేనను దగ్గరకు తీసుకున్నాం. భారత్ అనేక వైవిధ్యాలున్న దేశం. అందుకే ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది తమ విధానం. అందుకే ప్రాంతీయ పార్టీలను స్వాగతించాలి. వాటికి సహకారం అందించాలి. జాతీయ పార్టీ ఎంత పెద్దది అయినా కావొచ్చు. కానీ ప్రాంతీయ పార్టీల సిద్ధాంతాలను గౌరవించాలి. అది బీజేపీ చేసి చూపిస్తుంది.

మరోవైపు జాతీయ రాజకీయాలు సైతం అలానే ఉండాలి. అదుకే తమతో ఎవరూ ఉన్నా లేకపోయినా తాము మాత్రం ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు విలువ ఇస్తామని చెప్పారు ప్రధాని మోదీ. ఏపీలో కూటమితో లాభం ఏంటని ప్రశ్నించగా.. లాభ నష్టాలను చూసుకొని రాజకీయం చేయడం, పొత్తులు కుదుర్చుకోవడం బీజేపీ సిద్ధాంత కాదన్నారు. పొత్తులను కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయోద్దని..అది మేం ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే గౌరవం అని పునరుద్ఘాటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: