చొరబాటు దారులు, ఎక్కువ మంది పిల్లలను కనేవారంటూ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ యూ టర్న్ తీసుకున్నారు. ముస్లింలను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తూ ముస్లింలను ఎందుకు అన్యాయం చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.


ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా మీకు ఓటేస్తారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ భారతీయులైతే నాకు ఓటేస్తారు అంటూ సమాధానం ఇచ్చారు.  అంటే ఓటేయని వారు భారతీయులు కాదా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. అయితే 2014, 2019లో బీజేపీకి 40 శాతానికి మించి ఓట్లు రాలేదు. అలాగే 220 సీట్లలో మాత్రమే బీజేపీకి 50శాతానికి మించి ఓట్లు పోలయ్యాయి. మిగతా 320 సీట్లలో ఆ పార్టీకి 50శాతంలోపే ఓట్లు వచ్చాయి.


అంటే దేశ జనాభాలో 60శాతం మంది భారతీయులు కాదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇండియాలో ఉన్న 60శాతం మంది ప్రజలు భారతీయులు కాదని దేశ ప్రధాని వ్యాఖ్యానిస్తే మనకి గౌరవం ఇచ్చినట్లేనా. భారతీయులు అయితే కచ్ఛితంగా మోదీకే ఓటేయాలా. అంటే భావ స్వేచ్ఛ హక్కు, వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం భారతీయులకు లేదా.  


భిన్న రాజకీయాలు ఉన్నంత మాత్రాన వారంతా భారతీయులు కాకుండా పోతారా? ఇప్పటికే క్యాంపెయిన్ లో హిందూ, ముస్లిం వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మోదీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. తనకు ఓటేయని వారు భారతీయులే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం చెప్పినవి అమలు చేస్తేనే..లేక తలాడిస్తేనే మీరు భారతీయులు ప్రశ్నిస్తే దేశ ద్రోహులు కింద లెక్కే అన్నట్లు ఉంది ప్రధాని వ్యవహరిస్తున్న తీరు. భిన్న రాజకీయ పార్టీలు, ప్రశ్నించే తత్వం ఉండటమే నిజమైన రాజ్యాంగ ప్రజాస్వామ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియన్లను మోదీ అవమానించి నట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: