ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపద్యంలో... ఇప్పుడు అందరికన్నా ఫలితాల పైన ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. చాలామంది బెట్టింగులు కూడా కాస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది... కాదు వైసిపి మరోసారి అధికారాన్ని చేపడుతుందని మరికొంతమంది బెట్టింగ్లు పెడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీని ఓ అంశం వెంటాడుతోంది. ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతే... ఆ పార్టీ భూస్థాపితం కావడం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం జగన్ పనితీరు అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యేలను మారుస్తాడనీ... అసలు ఎమ్మెల్యేలను నమ్మబోడని... అలాంటి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉండటం కష్టమే అంటున్నారు.

అయితే... వైసీపీ పార్టీ ఓడిపోతే... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న పరిణామాలు చవిచూస్తుందని చెబుతున్నారు. పదవులు అనుభవించిన నేతలు కూడా... పార్టీ మారుతారని స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి ఓడిపోతే... ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండే ఛాన్స్ ఉండబోదని చెబుతున్నారు.

అందులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వైసిపి పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆ పార్టీకి కార్యకర్తలు మాత్రమే మిగులుతారని... వెల్లడిస్తున్నారు. ఇక మూడవ పార్టీ జనసేన. ఈ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే... పార్టీ మొత్తం మూతపడటం గ్యారెంటీ అంటున్నారు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండేందుకు నేతలు ఎవరు ఒప్పుకోవడం లేదని... సంవత్సరాలు గడిచిన అధికారం రాకపోతే... ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని అంటున్నారు. కచ్చితంగా అధికారం ఎవరి చేతులు ఉంటే వారి దగ్గరికి జనసేన నేతలు వెళ్తానని చెబుతున్నారు. మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు... ఈ మూడు పార్టీలకు గండంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: