ఆంధ్రాలో ఈసారి అధికారాన్ని దక్కించుకోబోయేది ఎవరు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే టిడిపి జనసేన బిజెపి పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి వస్తుందని  కొంతమంది అనుకుంటుంటే.. జగన్ వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ఇంకొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి గత ఎన్నికలతో పోల్చి చూస్తే భారీగా పోలింగ్ శాతం నమోదయింది.


 ఇలా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ పాయింట్ గా మారిపోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే గెలుపు మాదే అంటూ అటు కూటమి ఇటు వైసిపి ధీమాతో ఉన్నప్పటికీ.. ఇక ప్రజలు ఏమి నిర్ణయించారు అనే విషయంపై మాత్రం ప్రధాన పార్టీల అందరిలో కూడా టెన్షన్ టెన్షన్ గానే ఉంది. అయితే అధికార వైసీపీలో కూడా  ప్రభుత్వ పథకాలు అన్ని కూడా ఎంతో సమర్థవంతంగా ప్రజలకు చేరువయేలా వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఇక ఈ వాలంటీర్లే ప్రజా ప్రతినిధులు చేయాల్సిన అన్ని పనులను చేసేసారు  ప్రజల దగ్గరికి వెళ్లి అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చూసారు.


 అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాయ్. ఇసుక మద్యం విషయంలో కూడా ఎవరికి సంబంధం లేకుండా జగన్ అన్ని అధికారాలను తన దగ్గర పెట్టుకున్నారు. కానీ లోకల్ నాయకులకు పనే లేకుండా పోయింది. ఇక తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాస్త కూసో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకున్న  లోకల్ నేతలకు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చిన అడపాదడప కాంట్రాక్టులు కూడా కొంతమంది నేతలకు మాత్రమే దక్కడంతో మిగతా నేతల్లో ఇక నెగెటివిటీ మొదలైంది. దీంతో సొంత పార్టీ నేతలే వైసిపికి ఎదురు తిరిగిన పరిస్థితి. అందుకే ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతూ జగన్ బరిలోకి దిగారు. అయినప్పటికీ ఇక లోకల్ క్యాడర్ వైసీపీ వైపు ఉందా లేదా అన్న విషయంపై మాత్రం అటు జగన్ కు భయం పట్టుకుందట. మరి ఇలా అసంతృప్తితో ఉన్న వైసీపీ లోకల్ క్యాడర్ ఎంతవరకు పార్టీ కోసం పనిచేశారు అన్నది అటు రిజల్ట్ వస్తేగానీ ఎవరికి క్లారిటీ రాదు

మరింత సమాచారం తెలుసుకోండి: