- మ‌ళ్లీ వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే టీడీపీ టాప్ లీడ‌ర్ల‌కు కేసుల ముప్పు
- కేసులు, పోరాటాలు అంటూ ఐదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిర‌గాల్సిందే
- కేసుల భ‌యంతో గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌చ్చే నేత‌లూ క‌రువేనా ?


( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

ప్ర‌స్తుతం జ‌రిగిన పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొం ది. ఏ పార్టీకి.. ఆ పార్టీ ఫ‌లితంపై ధీమా వ్య‌క్తం చేస్తోంది. మేమే గెలుస్తామ‌ని వైసీపీ, కాదు మాకే ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నార‌ని టీడీపీ చెబుతున్నాయి. అయితే.. వాస్త‌వ ఫ‌లితం వ‌చ్చేందుకు మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉంది. ఎవ‌రు గెలిచినా.. ఒక పార్టీనే అధికారంలోకి వ‌స్తుంది. ఒక‌వేళ‌.. టీడీపీ నేత‌ల ఆశ‌ల‌కు భిన్నంగా ఫ‌లితం వ‌స్తే ఏం జ‌రుగుతుంది? అనేది ప్ర‌శ్న‌.


ఇలా.. టీడీపీ ఓడిపోవాల‌ని కాదుకానీ.. ఓడితే మాత్రం ప‌రిస్థితి దారుణంగానే ఉంటుంద‌ని పార్టీ నాయ‌కు లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా అంతర్గ‌త స‌మావేశాల్లో ఇదే విష‌యం చెప్పారు. ఇప్ప‌టికే గ‌త నాలుగేళ్లుగా పార్టీలో కీల‌క నాయ‌కులు కేసు ఎదుర్కొన్నారు. అచ్చెన్నాయుడు నుంచి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, చిన్న‌రాజ‌ప్ప స‌హా ప‌య్యావుల కేశ‌వ్ వ‌ర‌కు.. ప్ర‌తిజిల్లాలోనూ కీల‌క‌నేత‌లు కేసుల్లో ఇరుక్కున్నారు.


వీరిలో హ‌త్యాయ‌త్నం కేసుఉన్న కొల్లు ర‌వీంద్ర వంటి వారు కూడా ఉన్నారు. ఇక‌, తాడిప‌త్రిలో అయితే.. జేసీ బ్ర‌ద‌ర్స్ ప్ర‌తి నెలా పోలీసులు, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరిగారు. మ‌రోవైపు.. పార్టీ అధినేత చంద్ర‌బాబుపైనే స్కిల్ స్కాం కేసు ఉంది. ఇక‌, నారా లోకేష్‌పై న‌మోదైన ఫైబ‌ర్ గ్రిడ్ కుంభ‌కోణం ప్ర‌స్తు తం పెండింగులో ఉంది. మ‌రికొంద‌రిపై న‌మోదైన కేసులు కూడా.. ప్ర‌స్తుతం పెండింగులో ఉన్నాయి. రేపు టీడీపీ క‌నుక అధికారంలోకి రాక‌పోతే.. ఆయా కేసులు మ‌రింత‌గా పెరుగుతాయ‌న‌డంలో సందేహం లేదు.


ఇదే స‌మ‌యంలో మ‌రిన్ని కేసులు పెట్టినా ఆశ్చ‌ర్యం లేదు. కార‌ణాలు ఏవైనా కేసులు  మాత్రం కామ‌న్ అనే ప‌రిస్థితి క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. దీంతో కోర్టులు-కేసులు-న్యాయ పోరాటాలు అంటూ.. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు త‌మ్ముళ్లు కాలం గ‌డపాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలోవారు నోరెత్తి మాట్లాడేందుకు కూడా.. అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఇదే జ‌రిగింది. కొంద‌రు మాత్ర‌మే ధైర్యంగా ముందుకు వ‌చ్చారు. మిగిలిన మెజారిటీ నాయ‌కులు కేసు ల భ‌యంతో ఇంటికే ప‌రిమిత మ‌య్యారు. సో.. ఇప్పుడు గెల‌వ‌క‌పోతే.. ఈ ప‌రిస్థితి మ‌రింత పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు కూడా అంద‌చ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: