ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. జూన్ 21న  రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులంతా ప్రమాణ స్వీకారం కార్యక్రమం మొదలుపెట్టి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించుకున్నారు. ఇదే తరుణంలో రెండో రోజు కూడా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  రూల్స్ ప్రకారమే స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు చేపట్టి, సభా అధ్యక్ష హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగానే ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అంతేకాదు గతంలో జరిగిన భావోద్వేగ ఘటనలను గుర్తు చేసుకున్నారు. 

2019 ఎన్నికల సమయంలో అసెంబ్లీలో కౌరవ సభ నుంచి తనను వాకౌట్ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకొని చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు.  నిండు సభలో తన సతీమణిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నా మైక్ కట్ చేసేవారని, చాలా హేళన చేసే వారిని అన్నారు. ఆనాడు తను సభలో చేసినటువంటి వ్యాఖ్యలను ఈనాడు ముఖ్యమంత్రి హోదాలో మరోసారి చదివి అందరికీ వినిపించాడు.  రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు అని చెప్పారు. తన భార్యపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని, ప్రజల ఆమోదంతోనే మళ్ళీ సీఎంగా సభలోకి వచ్చానని, మరో జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుట్టి జాతి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

2019 సమయంలో టిడిపికి 23 అసెంబ్లీ సీట్లు వస్తే అది దేవుడు స్క్రిప్ట్ అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు ఆయన కింది బ్యాచ్ అంతా హేళన చేశారని,  ఈసారి కూటమి గెలిచిన 164 సీట్లు అన్నీ కలిపితే,  వాళ్ల 11 సీట్లు మాత్రమే రావడం దేవుడి స్క్రిప్ట, ఏంటో మరి ప్రజలే చెప్పాలని అన్నారు. 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమాలు చేశారని, వారి శాపమే జగన్ కు తగిలిందని తెలియజేశారు. ఆ అంకెలన్నీ కలిపితే 11 వస్తుందని ,  మరి వీరికి వచ్చిన ఆ సీట్లను నేను దేవుడి స్క్రిప్ట్ అనాలా ఇంకేమనాలో మీరే చెప్పాలని అన్నారు.  వైసిపి నేతలు కనీసం సభలో ఉండకుండా పిరికితనంతో సభకు హాజరు కాలేదని ఎద్దేవా చేశారు. గతంలో వారు సభలో ఉన్నప్పుడు మాదిరిగా మేము ప్రవర్తించమని ప్రజా సమస్యలపై ముందుగా ఫోకస్ పెడతామని తెలియజేశారు.  ప్రస్తుతం చంద్రబాబు మాటలు  వార్తల్లో  హైలైట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: