తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై... ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు గజ్వేల్ నియోజకవర్గం కెసిఆర్ పట్టించుకోవడంలేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మొన్న కెసిఆర్ ఆచూకీ కనిపించడం లేదని బిజెపి పార్టీ నేతలు కూడా గజ్వేల్ నియోజకవర్గంలో నిరసన తెలిపారు. అయితే తాజాగా కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో.... మరో నిరసన కార్యక్రమం తెర పైకి వచ్చింది.

 

గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులు... నిరసనకు దిగారు. ఇందులో భాగంగానే డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల కోసం సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ వద్ద... నిరసన కూడా చేశారు బాధితులు. ఈ బాధితుల్లో అందరూ మహిళలే ఉండడం గమనార్హం. అయితే తమ సమస్యలు చెప్పుకుందామంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందుబాటులో ఉండడం లేదని.. వారు తమ ఆవేదనను వెళ్లగకుతున్నారు.


కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందుబాటులో ఉండి తమ సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని... గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ తమ వెంట ఉండి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు వేసి గెలిపించినందుకు కేసీఆర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


 అయితే... నిరసన తెలిపిన తర్వాత జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి వెనుతిరి గారు మహిళలు. ఇది ఇలా ఉండగా.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు...  మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం తరఫున విజయం సాధించారు. ఈటల రాజేందర్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన కెసిఆర్... కామారెడ్డి లో మాత్రం ఓడిపోయారు.  కెసిఆర్ చరిత్రలో కామారెడ్డి ఓటమి మొదటిది కావడం విశేషం. మరి గజ్వేల్  ప్రజల సమస్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: