
ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే 3500 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆసుపత్రి నెలవారి నిర్వహణలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటూ తెలియజేశారు. సుమారుగా ఎన్టీఆర్ వైద్య సేవకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన అటువంటి 4,000 కోట్ల రూపాయలు బకాయిలకే సమానంగానే ఉన్నాయంటూ తెలియజేశారు.. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు అటు ట్రస్ట్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చించినప్పటికీ కూడా బకాయిలు ఎప్పుడూ కూడా రిలీజ్ చేయలేదని తెలియజేసింది ట్రస్ట్.
అలాగే ప్యాకేజీ రేట్ల రివిజన్ సమయంలో కూడా తమను ఎవరు సంప్రదించలేదంటూ ట్రస్ట్ ఆవేదన తెలియజేస్తోంది. ఇప్పటికే తమ సామర్థ్యానికి మించి మరి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ముందుకు తీసుకు వెళ్ళామని బకాయిలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇక మీదట కొనసాగించలేమంటూ ట్రస్ట్ క్లారిటీ ఇచ్చిందట. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను సైతం పరిష్కరించినట్లు అయితే తిరిగి మళ్లీ ఎన్టీఆర్ సేవలను పునరుద్దించే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇకమీదట ఈరోజు నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఉండవన్నట్లుగా తెలియజేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే డాక్టర్లు కూడా రావడంలేదని హాస్పిటల్స్ సిబ్బంది కూడా ఆవేదనను తెలియజేస్తున్నారట. అందుకే ఈరోజు నుంచి తప్పని పరిస్థితులలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. మరి వీటి మీద ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించి ప్రజల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.