ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వైసిపి నాయకులు అరెస్ట్ అయ్యారు. మరి కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి బయటి దేశాలకు వెళ్లి... తమను తాము కాపాడుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీలో... ఆర్థికంగా బలంగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని టిడిపి కూటమి టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

 ఇందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అనేక కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ కేసుల నుంచి బయటపడేందుకు తండ్రి కొడుకులు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో... పెద్దిరెడ్డి కుటుంబానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని తాజాగా ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఏపీ  cid పోలీసులు.

 అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో... మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరుడు వంకా రెడ్డి మాధవరెడ్డిని.... ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ప్రధాన కుట్ర దారుడిగా మాధవరెడ్డి పై సిఐడి పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కదా నెల రోజులుగా మాధవరెడ్డి పరారీలో ఉన్నాడు. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం పెద్దకొట్టిగల్లు వద్ద.. ఓ ఫామ్ హౌస్ లో ఈ నెల రోజుల పాటు మాధవరెడ్డి దాక్కున్నారట.


 అయితే ఈ సమాచారం అందుకున్న ఏపీ సిఐడి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తాజాగా పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని అరెస్టు చేశారు. అయితే ఈ సమాచారం అందగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... వెంటనే అలర్ట్ అయ్యారట. మాధవరెడ్డిని జైలు నుంచి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీగల్ టీం తో కూడా సమావేశం నిర్వహించారని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: