వైసీపీ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇటీవలే టిడిపి కార్యకర్త పైన చేయి చేసుకున్న కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు.. అయితే గుంటూరు కోర్టు ఇప్పుడు తాజాగా షరతులతో కూడిన బెయిల్ ని కూడా మంజూరు చేసినట్లు తెలుస్తోంది.. ఈనెల 11వ తేదీన ఈయన పైన కేసు నమోదయింది. అనంతరం ఈ రోజున రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల మాధవ్ విడుదల కాబోతున్నారు.అలాగే ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి సంతకం చేయాలని న్యాయవాదులు కూడా ఆదేశాలను జారీ చేశారు. అలా రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలంటూ కూడా సూచించడం జరిగింది.


వీటితో పాటుగా పదివేల రూపాయలు పూచికిత అలాగే ఇద్దరు జమీన్ల హామీతో వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి బెయిల్  మంజూరు చేసినట్లు తెలుస్తోంది. గత నెల 10వ తేదీన టిడిపి కార్యకర్త కిరణ్ తో పాటుగా కొంతమంది పోలీసుల పైన దాడి చేసిన సంఘటనలు గోరంట్ల మాధవ్ పైన కేసు నమోదయ్యి  పోలీసులు కూడా అరెస్టు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ తో పాటుగా రాజమండ్రి జైలు రిమాండ్ లో ఉన్న ఐదుగురు అనుచరులకు కూడా తాజాగా బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది.


ఈనెల 23వ తేదీ 24వ తేదీన గోరంట్ల మాధవ్ ను కస్టడీలోకి  తీసుకొని మరి విచారణ చేపట్టడం జరిగింది. ఇలా విచారణ అనంతరం ఇప్పుడు మళ్లీ బెయిల్ మీద బయటకు రావడంతో కొంతమేరకు గోరంట్ల మాధవ్ కు ఉరట కలిగించిందని చెప్పవచ్చు. ఇప్పటికే వైసీపీ పార్టీలో దూకుడుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకవైపు పార్టీ పరంగా యాక్టివ్ గా ఉంటూ మరొకవైపు తన దూకుడుని కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవలే వైసిపి పార్టీ ప్రమోషన్ కూడా కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: