ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమరావతి కార్యక్రమానికి పిలవడానికి మోదీని కలవగా దేశ ప్రజలు ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు అనే ఆవేదన మోదీగారిలో చూశానని బాబు తెలిపారు. ఈ సందర్భంగా మీ అందరి తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నానని ఉగ్రవాదాన్ని అణచివేయడానికి మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని తెలిపారు.
 
ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని తెలిపారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే బాధలో మోదీ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారని గతంలో మోదీని ఎప్పుడు కలిసినా ఆయన ఆహ్లాదకరంగా ఉండేవారని ఆయన కామెంట్లు చేశారు.
 
మళ్లీ మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునః ప్రారంభం అయ్యాయని గత ఐదేళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని గతంలో మోదీయే అమరావతి పనులకు శంఖుస్థాపన చేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మరో మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 5 లక్షల మంది విద్యార్థులు చదువుకునేలా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
 
అమరావతిని ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం కొసమెరుపు. చంద్రబాబు నాయుడు పనితనం గురించి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించడం గమనార్హం. చంద్రబాబు పాలనను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇవ్వగా ఆ హామీల అమలు సాధ్యమవుతుందో లేదో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.




మరింత సమాచారం తెలుసుకోండి: