పహల్గాం ఉగ్రవాది దాటికి దీటుగా భారత్ కౌంటర్ ఎటాక్ ని సైతం నిన్నటి రోజున రాత్రి నుంచి మొదలుపెట్టింది. ఉగ్రవాద స్థావరాలపైన ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపోవడం జరిగింది. ఇందులో తొమ్మిది ప్రాంతాలలో భారత్ సైన్యం కూడా దాడులు నిర్వహించింది. దీంతో 30 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లుగా వినిపిస్తున్నాయి. భారతదేశ చేసినటువంటి ఈ దాడిలో బహవల్ పూర్, కోట్లి, ముజఫరాబాద్ వంటి వాటిపైన క్షిపణులు దాడి చేశారు. అయితే ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా పేరుపొందిన మసూద్ ఆజాద్, హఫీజ్ సయ్యద్ మరణించారా లేదా తప్పించుకున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నదట.



భవహల్ పూర్ లోని మసూద్ ఆజా ప్రధాన కార్యాలయాన్ని సైతం భారత్ లక్ష్యంగా చేసుకొని మరి దాడి చేసిందట. దీంతో వీరి కార్యాలయం ధ్వంసం అయ్యిందని ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా వెల్లడించింది. ఇందులో 50 మంది జైషే ఉగ్రవాదులు కూడా హతమయ్యారట. ఇదే కాకుండా మురిడ్కేలోని లస్కరి రహస్య స్థావరాన్ని కూడా ఈ దాడిలో ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది ఇండియా. ఇందులో చాలామంది అగ్ర కమాండర్లు కూడా హతమయ్యారట. ఇదే దాడిలో మసూద్ ఆజాద్, ఫహీద్ సాహిత్ మరణించినటువంటి సమాచారం మాత్రం ఇంకా బయటికి రాలేదట.

భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాభాజ్ షరీఫ్ మాత్రం అక్కడ అత్యవసర సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారట. అయితే ఈ దాడిని సైతం పాకిస్తాన్ ప్రధాని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది .భారత్ మనపై యుద్ధానికి కాలు దువ్వుతున్నారని ప్రతీకారం తీర్చుకునేందుకు మనకు కూడా హక్కు ఉందని అందుకు దీటుగా బదిలిస్తామంటూ ఒక ప్రకటనను కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ వల్ల పాక్ భయభ్రాంతులకు గుర అయ్యేలా చేసింది ఇండియా. మరి మరి కొన్ని గంటలలో ఎలాంటి చోట్ల ఎలాంటి ఉద్రిక్తలు ఏర్పడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: