భారత ప్రతికార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా డ్రోన్లు .. క్షిప‌ణుల తో విరుచుకు పడేందుకు ప్రయత్నించిన దాయాది దేశానికి చుక్కెదురు అయ్యింది. ఈ క్రమంలోని పాకిస్థాన్లోని ఆయా ప్రాంతాలలో మోహరించిన గగనతల .. రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయినట్టు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది నిజంగా పాకిస్తాన్ కు బిగ్ షాక్ గా చెప్పాలి. చైనాకు చెందిన హెచ్ క్యూ 9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాలలో దాడులకు ప్రయత్నించింది.


అవంతిపుర - శ్రీనగర్ - జమ్మూ పటాన్ కోట్ - అమృత్సర్ - కపూర్తల - జలంధర్ - అదంపూర్ - బటిండా - చండీఘర్ - నాల్ - పలోడి - బుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లఖ్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ - యూఏఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి సేకరాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే భారత ప్రత్యేక దాడులకు కూడా దిగింది. పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాలలో ఉన్న గగనతల రక్షణ రాడార్ల‌ను.. గ‌గ‌న త‌ల‌ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ కు గుండెకాయ లాంటి లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్య‌వ‌స్థ ధ్వంసం అయిన‌ట్టు తెలిసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: