గత నాలుగు ఐదు రోజుల నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య ఎక్కువగా యుద్ధ వాతావరణం కనిపించింది. కానీ నిన్నటి రోజున రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్, ఇండియా మధ్య శాంతి చర్చలు జరిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కూడా పాకిస్తాన్ బుద్ధి మారకుండా దొంగ దెబ్బలు తీస్తూ ఉన్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని పాకిస్తాన్ సరిహద్దులలో జరిగిన క్రాస్ కాల్పులలో బిఎస్ఎఫ్ చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ వీరమరణం పొందినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని బిఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.


మహమ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించి మృతుల కుటుంబానికి కూడా సంతాపాన్ని తెలియజేశారు. మే 8, 9వ తేదీల మధ్య రాత్రి జరిగిన క్రాస్ కార్డుకులలో మహమ్మద్ ఇతిహాస్ గాయపడ్డారని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలియజేశారు. ఈ విషయం పైన అధికారులు మాట్లాడుతూ మే 10 - 2025  జమ్మూ జిల్లాలో ఆర్ఎస్ పుర సెక్టార్లో కాల్పుల సమయంలో దేశ సేవలో వీరమరణం పొందిన సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ చేసిన ఈ త్యాగానికి సెల్యూట్ చేస్తున్నామని.. బిఎస్ఎఫ్ సరిహద్దు పోస్టుకు న్యాయకత్వం వ్యవహరిస్తూ ముందు వరుసలో ధైర్యంగా నిలిచిన ఈ జవాన్ కు సెల్యూట్ చేస్తున్నామంటూ తెలిపారు.


బిఎస్ఎఫ్ డీజీతో పాటుగా అన్ని ర్యాంకులు అధికారులు ఆయన కుటుంబానికి సైతం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున ఫలవురాలోని ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో పూర్తి గౌరవాలతో కార్యక్రమాలను పూర్తి చేశారట. అయితే ఇదే కాల్పులలో మరో ఏడు మంది గాయాలు పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది జవాన్లు కూడా వీర మరణం పొందారు. మరి భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం చేసినప్పటికీ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోవాల్సి వస్తాయో చూడాలి మరి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: