గులాబీ పార్టీలో  ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు వరుసగా రెండు రోజులపాటు సమావేశమయ్యారు. అది కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి... గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడం ఇక్కడ వివాదంగా మారింది. బావబామ్మర్దులు కాబట్టి.. ఇలా కలుసుకోవడం కామనే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బావా బామ్మర్దుల సమావేశంపై.... మసాలా చల్లుతోంది.

 గులాబీ పార్టీలో చీలిక వచ్చిందని... పార్టీ పగ్గాలు చేపట్టేందుకు... కవిత ప్లాన్ వేస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కవితకు బ్రేకులు వేసేందుకు కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు ఒకటయ్యారని.. కాంగ్రెస్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత.. జనాల్లోకి వెళ్తోంది. రిజర్వేషన్లు, మహిళల సమస్యలు అంటూ  జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీ పగ్గాలు... చేపట్టేందుకు కల్వకుంట్ల కవిత  స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు.

 అయితే కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగితే తమ ఆటలు సాగవు అని కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు ఒక్కటయ్యారని... అధికార పార్టీ కాంగ్రెస్, బిజెపిలో ప్రచారం చేస్తున్నాయి. అయితే వీళ్ళ ప్రచారానికి తగ్గట్టుగానే అమెరికాకు కల్వకుంట్ల కవిత వెళ్లగానే... హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఒక్కసారి కాదు వరుసగా రెండు రోజులు వెళ్లి మూడు గంటల పాటు చర్చించారు. అయితే వీళ్ళ సమావేశాలు వెనుక కారణం ఏంటని అందరూ అనుకుంటున్నారు. అయితే.. కాంగ్రెస్ ను ట్రాప్ లో పడేసేందుకు కేసీఆర్ ఇలా స్కెచ్ వేశారని మరికొంతమంది చెబుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: