
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీకి కొన్ని షాకులు మాత్రం తప్పడం లేదు. ఏ పార్టీ నేతలైనా అధికారం దక్కిన తర్వాత వాళ్లలో కచ్చితంగా కొంతమేర మార్పు వస్తుంది. చాలామంది నేతల్లో అధికారం దక్కిన తర్వాత అహం వచ్చి చేరుతుంది. అయితే నేతల అహం అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని చెప్పవచ్చు.
టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓట్లు చీలకుండా ఉండటంతో పాటు పార్టీల బలం పెంచుకోవడం కోసం అని కూడా చెప్పవచ్చు. గతంలో పొత్తు లేకపోవడం వల్ల టీడీపీ నష్టపోయింది. అయితే విశాఖలో ఉన్న కార్పొరేటర్ల వ్యవహార శైలి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. జనసేనకు విశాఖలో డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడం గమనార్హం.
అయితే జనసేనకు ఇవ్వడంతో టీడీపీకి చెందిన కార్పొరేటర్లు హాజరు కాకపోవడం సంచలనం అవుతోంది. ఈ విధంగా జరగడం టీడీపీ అధిష్టానానికి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఈ తరహా ఘటనల వల్ల టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు దృష్టి పెడితే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
జనసేన జరుగుతున్న ఘటనల గురించి ఏ విధంగా స్పందిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతుండటం గమనార్హం. భవిష్యత్తులో టీడీపీ జనసేన మధ్య పొత్తు కొనసాగడం సాధ్యమేనా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు