
అయితే ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందట. ఈ విషయంపై జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ తన ట్రాప్లో ఏపీ సర్కార్ చిక్కుకొనేలా చేస్తున్నారనే విధంగా కొంతమంది కూటమినేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం విషయంలో వెనుకబడిందని జగన్ ఉంటే ఆదాయాన్ని సంపాదించి మరి పథకాలను అమలు చేసే వారన్నట్లుగా తెలియజేస్తున్నారు.. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంటే సరిపోయేది కానీ ఇక్కడ సంపద పెరిగిందని జగన్ కంటే మరింత ఎక్కువే సంపాదించామని చెప్పడం వల్లే అసలు చిక్కు ఎదురైంది.
ఆ వెంటనే మరి సంపాదించినప్పుడు సూపర్ సిక్స్ ని ఎందుకు అమలు చేయలేదంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు ప్రజల వరకు వెళ్లిపోయింది. నిన్న మొన్నటి వరకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అసలు ఆదాయమే లేదని వ్యవస్థలను సరి చేసే పనిలో ఉన్నామంటూ తెలియజేశారు. అందుకే సూపర్ సిక్స్ ఆలస్యం అవుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఆ తదుపరి వారంలోనే వైసిపి చేసిన ట్రాప్లోకి కూటమి సర్కార్ ఇరుక్కుంది అన్నట్టుగా వినిపిస్తున్నాయి. అందుకే సీఎం చంద్రబాబు కూడా వెంటనే పథకాలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.