
దీని కొరకు మాజీ సైనికులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మాజీ సైనికులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి వెల్లడించడం గమనార్హం.
ఈ కార్యక్రమం అమలు కోసం క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, స్కౌట్స్, గైడ్స్ తో పాటు రెండున్నర లక్షల రిటైర్డ్ సైనికుల సహాయం తీసుకుంతామని దాదా భూసే వెల్లడించారు. ఏప్రిల్ నెల 22వ తేదీన జరిగిన ఉగ్రదాడి సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ నెల 22వ తేదీన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఏకంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారనే సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నెటినన్ల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు