నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఆయన ఓ సీనియర్ నేత .. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంటు ఒకప్పుడు జనాల్లో బలంగా ఉండేది. అదే సెంటిమెంట్ నమ్ముకుని గత ఎన్నికలలో పోటీ చేసిన ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. అనంతరం వైసిపి అధిష్టానం ఆయనకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పుడు ఆయనను జిల్లా నాయకత్వం అసలు పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో మాజీ ఎంపీ ఆదాల‌ ప్రభాకర్ రెడ్డి అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1999లో అల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 - 2009లో సర్వేపల్లి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014లో టిడిపి నుంచి ఎంపీగా ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికలలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన వ్యాపారాలలో బిజీగా ఉన్న నెల్లూరుకు వస్తూ పోతున్నారు.


వైసీపీ అధిష్టానం ఆయనను నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా నియమించింది. హైదరాబాదులో ఉండే ఆదాల తరచూ నెల్లూరుకు వస్తున్న పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. నెల్లూరుకు వచ్చి శుభకార్యాలలో పాల్గొనటం .. అప్పుడప్పుడు అనుచరులతో సమావేశాలు పెట్టి వెళ్లిపోతున్నారు. జిల్లా నాయకత్వం ఆదాల‌ ప్రభాకర్ రెడ్డిని కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదట. ఆదాలకు వైసీపీలో రోజురోజుకు ప్రాధాన్యత తగ్గుతుంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు కావటం ... ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో చాలా ప్రెస్మీట్లో జరిగాయి .. అందులో ఒక్క దానికి కూడా ఆదాల రాలేదు. ఆయన కార్యాలయ ప్ర‌తినిధి గా ఉన్న రంగారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆయనను అసలు పట్టించుకోవడంలేదని తన అనుచరులకు జిల్లా ... రాష్ట్ర కమిటీ లో ప్రాధాన్య‌త‌ ఇవ్వాలని కోరినా అధినాయకత్వం ఆయన సూచనలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆదాల త‌న ప‌ని తాను చూసుకు పోతున్నార‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: