
అనంతవరం, నెక్కల్లు మధ్య 10, 12, 13, 15, 16 సర్వే నంబర్లలో ఉన్న స్థలాన్ని గూగుల్ కు ఇవ్వనున్నట్టు సమాచారం అందుతోంది. సీఆర్డీఏ ఈ స్థలాన్ని గూగుల్ కు కేటాయించడం కోసం ముందుకు రావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ సంస్థ అమరావతిలో కొత్త ప్రాజెక్ట్ కు అంకురార్పణ చేయనుందని తెలుస్తోంది. ఈ ప్రదేశానికి సమీపంలో రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్, విమానాశ్రయం రానున్నాయి.
గూగుల్ సంస్థ రాకతో ఆ ప్రాంతమంతా పారిశ్రామికంగా సైతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు కానుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అమరావతికి రాబోయే రోజుల్లో మరిన్ని దిగ్గజ సంస్థలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం లాంటి సంస్థలతో సైతం ఒప్పందం కుదిరిందని భోగట్టా. 2026 సంవత్సరంలో మరిన్ని ప్రముఖ కంపెనీలు అమరావతిలో కార్యకలాపాలను మొదలుపెట్టనున్నాయని సమాచారం అందుతోంది. అమరావతి అభివృద్ధి దిశగా చంద్రబాబు అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు