మ‌న్యం జిల్లా పార్వ‌తీపురంలో జ‌రిగిన ప‌ర్య‌ట‌న‌లో లోకేష్‌కు ఓ విద్యార్థి నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. డిఎస్సీ పరీక్షకు సమయం ఇస్తే బాగుండేదని హరికీర్తన అన్నపుడు లోకేష్ సమాధానమిస్తూ... డిసెంబర్ నుంచి ఇప్పటివరకు డిఎస్సీ కి 7నెలలు సమయం ఇచ్చాం. డిఎస్సీ ప్రకటించాక 23 కేసులు వేశారు. విద్యామంత్రిగా రాజకీయాలు మాట్లాడను. ఇక్కడ కూడా నా ఫోటోలు పెట్టవద్దని చెప్పాను. ఎలాగైనా నోటిఫికేషన్ ఆపాలని చూశారు. కావాలని కొంతమంది స్వార్థపరులు అడ్డుకోవాలని చూశారు. నిర్ణీత సిలబస్ లో ప్రిపేర్ అయ్యేందుకు చాలా సమయం ఇచ్చామని చెప్పారు. పార్వతీపురం వేదాంత జూనియర్ కాలేజికి చెందిన మహమ్మద్ సద్దూర్ మాట్లాడుతూ... నా తండ్రి బిజినెస్ మ్యాన్. ఆయన ప్రోత్సాహంతో బాగా చదువుకోగలుగుతున్నా. వెనుకబడిన పార్వతీపురం ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుయాలు కల్పించాలని కోరగా, వాటిపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.


జోగిపేట ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో చదివి ఐఐటి సీటు సాధించిన కె.అభిరామ్ మాట్లాడుతూ...  నాకు ఐఐటి, ఎన్ఐటిలో కూడా ర్యాంకు కూడా వచ్చింది. మా నాన్న ఆటో డ్రైవర్. ఆయన కష్టాన్ని చూసి చదువుకున్నా. మా కాలేజిలో ఇద్దరు ఐఐటి, ముగ్గురికి ఎన్ ఐటి సీట్లు వచ్చాయి. కలెక్టర్, పిఓగారు బుక్స్ సమకూర్చారు. గతంలో మాలాంటి ప్రతిభగల విద్యార్థులకు 50వేలు, ల్యాప్ ట్యాప్ ఇచ్చేవారు. 2019 తర్వాత వాటిని ఇవ్వడం లేదు. మాకు ఆర్థిక సాయం అందిస్తే ఇంకా ముందుకు వెళతామని అన్నారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ... ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు గతంలో మాదిరిగా నగదు ప్రోత్సహకం, ల్యాప్ ట్యాప్ లను ఇప్పటినుంచే అందిస్తామని ప్రకటించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: