ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైనా సరే టిడిపి వైసిపి మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి బీజేపీ,జనసేన పార్టీలు కూడా అందులో వచ్చి చేరాయి.. జనసేన, బీజేపీ రెండు పార్టీలు టిడిపి తో కలిసిపోయి  కూటమిలాగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి.. ఇదే తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ సీట్లు కూడా దక్కలేని పరిస్థితికి వెళ్లిపోయింది.. ఇదంతా పక్కన పెడితే ఎప్పుడు కూడా అధికార పక్షానికి ప్రతిపక్షానికి గొడవలు జరుగుతూనే ఉంటాయి. మిగతా రాష్ట్రాల లాగా చిన్న చిన్నగా గొడవలు పెట్టుకొని మాటలతో ఊరుకోరు. కొట్టుకోవాలి లేదంటే నరుక్కోవాలి ఆఫీసులు తగలబెట్టడాలు లాంటివి జరుగుతూ ఉంటాయి.. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగి గొడవ జరిగింది. 

ఈ గొడవకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ కి లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఆ గిఫ్ట్ ఏంటి వివరాలు చూద్దాం.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఎలాంటి అవమానం జరిగిందో మళ్లీ అదే రూపంలో జగన్ కి కూడా అవమానం జరుగుతుంది. అలా తండ్రికి ఇచ్చిన గిఫ్ట్ ని లోకేష్ రిటర్న్ గిఫ్ట్   రూపంలో జగన్ కి ఇచ్చారని చాలామంది అంటున్నారు. కుప్పం నియోజకవర్గం అంటేనే  చంద్రబాబుకు కంచుకోట. కానీ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అక్కడ  వ్యతిరేక అభ్యర్థిని తయారుచేశాడు. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు పర్యటనకు వస్తే ఆయనకు వ్యతిరేకంగా వైసిపి పర్యటనలు చేశారు.

అలాగే అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా గోదావరి జిల్లాకు వెళ్లిన తర్వాత ఎదురు గుండా విశాఖ ఉద్యమం పేరుతో  ఎదురుగా వచ్చి గొడవలు చేశారు. ఈ విధంగా చంద్రబాబుకు చాలాసార్లు  అడ్డువచ్చి ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి మీడియాకు సంబంధించి మహిళలను అవమానకరంగా మాట్లాడారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే పొగాకు రైతులకు సంబంధించి పొదిలి నియోజకవర్గానికి జగన్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలోనే టిడిపి వైసిపి మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. రాళ్లు చెప్పులు విసురుకున్నారు.

 ఓ వైపు పోలీసులకు పార్టీ నాయకులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా డిఎస్పి మీదికి కూడా చెప్పులు విసిరారు. ఇక ఈ ఘటనపై జగన్మోహన్ రెడ్డి తప్పకుండా క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన జరుగుతుంటే వైసీపీ రెచ్చగొట్టిందంటూ ఆరోపించారు. గతంలో టిడిపి హయాంలో నిర్వహించినప్పుడు జరిగినటువంటి దాడుల్లో వైసిపి శాంతియుత నిరసన చేస్తే టిడిపి రెచ్చగొట్టిందని అన్నారు. ఇప్పుడు జగన్ పర్యటనను కూడా అడ్డుకొని శాంతియుతంగా మహిళలు నిరసన చేస్తుంటే వైసీపీ రెచ్చగొట్టిందని లోకేష్ అనడం చూస్తే జగన్ కు లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే కనబడుతోందని ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: