అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటికే 265 మంది మృతి చెందారు. ఇందులో నుండి ఒకే ఒక్కడు గాయాలతో బయటపడ్డాడు. ఇక ఆయన చెప్పిన మాటలు వింటుంటే అందరూ భయాందోళనకు గురవుతున్నారు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫ్లైట్ టేకాఫ్ అయినా కొద్ది సెకండ్లలోనే కుప్పకూలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.ఇక విమానంలో ప్రయాణించిన వాళ్ళందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా కాలేజీ బిల్డింగ్ పై పడటంతో దాదాపు 25 మంది మెడికోలు కూడా మరణించారు.. అలా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతోమంది కుటుంబాలలో కన్నీళ్లు నింపింది. అయితే తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఆ జ్యోతిష్యరాలు ముందుగానే గుర్తించింది అంటూ ఒక సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆరు నెలల ముందే విమాన ప్రమాదాన్ని గుర్తించిన ఆ జ్యోతిష్యులు ఎవరు.. నిజంగానే ఆమె చెప్పినట్టే జరిగిందా అనేది ఇప్పుడు చూద్దాం. 

తాజాగా ఎక్స్ వేదికగా ఆస్ట్రో శర్మిష్ఠ అనే జ్యోతిషరాలు పెట్టిన ఒక సంచలన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఆ ట్వీట్ లో ఏముందంటే.. 2025 లో విమానయాన ప్రయాణాలు చాలా వేగంగా మెరుగ్గా పని చేస్తాయి.కానీ విమాన ప్రమాదాలు మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎందుకంటే గురు గ్రహం మిధున రాశి లోని మృగశిర, ఆర్ద్ర నక్షత్రాలలో నెలకు దాదాపు 6.5 డిగ్రీల వేగంతో ఉన్న సమయంలో విమానయానం అభివృద్ధి చెందుతుంది. కానీ విమానంలో భద్రతా లోపాలు సురక్షిత లోపాలు తలెత్తుతాయి.. అయితే ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్  నెట్టింట సంచలనం సృష్టించడమే కాకుండా స్వయంగా శర్మిష్ఠ నేను ఈ ప్రమాదాన్ని ఆరు నెలల ముందే సోషల్ మీడియాలో ట్వీట్ చేశానని మళ్లీ తన ట్వీట్ ని వైరల్ చేసింది.

దీంతో శర్మిష్టి పెట్టిన ట్వీట్ చూసి చాలామంది షాక్ అయిపోతున్నారు.ఇక గుజరాత్లో ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆస్ట్రో శర్మిష్ట 10 సంవత్సరాలకు పైగా వేద జ్యోతిష్యంలో అనుభవజ్ఞురాలుగా కొనసాగుతుంది. విమాన ప్రమాదం మాత్రమే కాకుండా 2025 లో పాకిస్థాన్లో చాలా ఇబ్బందులు, గడ్డుకాలం ఏర్పడుతుందని ముందుగానే ఊహించింది. అయితే ఈమె జ్యోతిష్యం నిజమవ్వడంతో చాలామంది ఫాలోవర్స్ పెరిగి పోయారు. ఆరు నెలల ముందు ఎలా అయితే విమానయాన ప్రమాదాలు భద్రత,సురక్షిత లోపం వల్ల జరుగుతాయని చెప్పిందో అచ్చం అలాగే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కూడా భద్రతా లోపం వల్లే విమానయాన సంస్థ నిర్లక్ష్యం వల్లే జరిగిందని వీడియో కూడా షేర్ చేశారు అందులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: