తెలంగాణ ఫార్ములా ఈ కేసులో.. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఈ రోజున విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతూ ఉండగా ఈ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవనంలో కూడా కేటీఆర్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. చట్టం మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది కాబట్టే విచారణకు ఎన్నిసార్లు పిలిచినా కూడా హాజరవుతున్నామంటూ తెలియజేశారు. ఇప్పుడు ఇది మూడవసారి చేస్తున్నారు.. ఇంకా 30 సార్లు పిలిచినా కూడా విచారణకు హాజరవుతాను అంటూ కేటీఆర్ తెలియజేశారు.

అయితే ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కూడా ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్  విచారణకు హాజరవుతున్నారని తెలిసి  పోలీసులు కూడా భారీగానే బందోబస్తున ఏసీబీ  కార్యాలయం ముందు కుంచినట్లుగా తెలుస్తోంది. ఏసీబీ కార్యాలయం ముందు భారికెడ్లు కూడా ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా అనుమతించలేదని కేటీఆర్ వెంట కేవలం  రామచందర్ రావు లాయర్ మాత్రమే ఉన్నారు. ఇక కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, టీఎస్పీ మాజీధ్ ఖాన్ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.


అలాగే మరొకవైపు తెలంగాణ భవనంలో న్యాయవాదులతో కలిసి మంత్రి హరీష్ రావు కూడా సమావేశమైనట్లుగా సమాచారం కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాల పైన వారితో  చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ నేతలతో పాటుగా మరి కొంతమంది నేతలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి కేటీఆర్ విచారణ చేపడుతున్నారనే విషయం పైన కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసు పైన ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఇక కేసీఆర్, హరీష్ రావులను కూడా కాలేశ్వరం ప్రాజెక్టు విషయం పైన కూడా విచారణ చేపట్టారని తెలిసిందే.. ప్రజలకు ఇచ్చిన హామీలను అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తోంది అంటూ టిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: