
ముఖ్యంగా కరోనా మహమ్మారి వంటి చేదు రోజుల్ని గుర్తుకు తీసుకువచ్చే చర్చలను తీసుకువచ్చారు.. భద్రతా కారణాలు దృష్టివల్లే జగన్ తో సహా కేవలం మరొక 100 మందికి మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నట్లు పల్నాడు ఎస్పి శ్రీనివాసరావు తెలియజేశారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు సుమారుగా 30 నుంచి 50 వేల వరకు ప్రజలు హాజరవుతారని వైసిపి వర్గాల నుంచి అంచనాలు రావడంతో .. ఆ విగ్రహావిష్కరణ స్థలం కేవలం పది అడుగుల వెడల్పు దారి ఉండడంతో ఆధారీలో అంతమంది వెళ్లడం కష్టమని ఎస్పీ స్పష్టం చేశారు.
దీంతో వైసిపి నేతలు కార్యకర్తలు తమ నాయకుడికి వస్తున్న ఆదరణ చూసి టిడిపిలో గుబులు పుట్టిందని కామెంట్లు చేస్తున్నారు.. అందుకే జగన్ పర్యటనకు కేవలం 100 మంది మాత్రమే పరిమిషన్ ఇచ్చారని ఎస్పీ చెప్పడంతో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన విమర్శలు వినిపిస్తున్నాయి.. కరోనా సమయంలో కూడా సభలు, సమావేశాలు మీరు చేసుకున్నప్పుడు ఇలాంటి నిబంధనలు విధించారా..మరి ఇప్పుడు ఎందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలామంది కార్యకర్తలు సైతం జగన్ ని ఎంతగా అడ్డుకుంటే ఆయన బలం మరింత పెరుగుతుందని ఈ విషయాన్ని టిడిపి పెద్దలు కూడా గ్రహించాలి అంటూ తెలుపుతున్నారు. వీటన్నిటిని చూస్తూ ఉంటే జనం జగన్ పర్యటనలో పాల్గొనకూడదని కూటమి ప్రభుత్వం చేస్తోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు.