మన దేశంలో గతంలో 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నోట్ల రద్దు ఒకింత సంచలనం అయింది. తర్వాత రోజుల్లో 2000 రూపాయల నోట్లు, కొత్త 500 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే 2000 రూపాయల నోట్ల వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నోట్లను సైతం వెన్నకు తీసుకుంది. అయితే దేశంలో 500 నోట్లు క్రమంగా మాయమవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే  కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు కాకుండా 500 రూపాయల నోట్ల చలామణిని  నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తోందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  2000 నోట్ల రూపాయలలా భవిష్యత్తులో 500 నోట్ల రూపాయలను  సైతం కేంద్రం  వెనక్కు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది.  ఇప్పటికే ఏటీఎంలలో 200, 100 రూపాయల నోట్ల లభ్యత పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం  73 శాతం ఈ నోట్లే అందుబాటులో ఉన్నాయని భోగట్టా.

500 రూపాయల నోట్ల చలామణి అంతకంతకూ తగ్గుతోందంటే ఇవి కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  అయితే 500 నోట్లకు సంబంధించి అధికారికంగా వచ్చిన వార్తలను మాత్రమే నమ్మాల్సి ఉంటుంది. కేంద్రం నోట్లకు సంబంధించి ఎలాంటి షాకులిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే  లేదని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

500 రూపాయల నోట్లు రద్దు అయితే మాత్రం ఒకింత సంచలనం అవుతోంది.  దేశంలో డిజిటల్ లావాదేవీలను అంతకంతకూ పెంచే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.  మోడీ  సర్కార్ భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో  చూడాల్సి ఉంది.  ఈ నోట్లు రద్దయితే  మాత్రం  ల్యాండ్ లావాదేవీలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. నోట్ల రద్దు గురించి వైరల్ అవుతున్న వార్తలు ప్రజలను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: