మొన్నటి వరకు ఉక్రెయిన్ రష్యా మధ్య  భీకరమైన యుద్ధం జరిగింది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది మరువకముందే మరో దేశం అయినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య  యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు  దాడులు చేసుకుంటూ ఆస్తులను ధ్వంసం చేసుకుంటూ ప్రతికార చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్  దాడుల్లో ఎంతోమంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఆర్మీ అధికారులకు సంబంధించి చాలా మంది మరణించారు. అయినా ఏ దేశం కూడా తగ్గకుండా మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

ఇదిలా కొనసాగుతున్న తరుణం లో తాజాగా ఈ రెండు దేశాల మధ్య లోకి రష్యా వచ్చింది.. యుద్ధం ఆపాలని అక్కడ దాడి చేయొద్దని ఇజ్రాయెల్ ను హెచ్చరించింది. కారణం ఏంటి చూద్దామా.. ఇజ్రాయిల్ వరుసగా ఇరాన్ లో ఉన్నటు వంటి అణు విద్యుత్ అణు వాటర్ కేంద్రాల పై దాడులు చేస్తోంది. ఇదే తరుణం లో రష్యా జోక్యం చేసుకొని  ఇరాన్ లోని బుష్ హర్ అణు విద్యుత్ కేంద్రం మీద దాడులు చేయొద్దంటూ రష్యా ఇజ్రాయిల్ ను అడిగింది. కానీ అప్పటికే ఇజ్రాయిల్ దాడులు మొదలుపెట్టేసింది.

 తక్షణమే అక్కడ దాడులు ఆపాలంటూ రష్యా కోరింది. బుషహార్ ప్రాంతంలోని అను విద్యుత్ కేంద్రం లో ఇరాన్ ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక అను విద్యుత్ కేంద్రం అది. ఇది టేహ్రాన్ నగరానికి 750 కిలోమీటర్లు దూరం లో ఉంది. దీని నిర్మాణం లో ఇరాన్ కు రష్యా సాయం అందించింది. ఉత్పత్తి అయిన యురేనియం  ఈ అణు విద్యుత్ కేంద్రంగా ఉపయోగపడుతుందని, ఇజ్రాయెల్ దాని జోలికి వెళ్లకూడదని రష్యా కోరింది. ఈ మాటలపై ఇజ్రాయిల్ కట్టుబడి ఉండి, ఆ అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేయకుండా ఉంటుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: