ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలు సాధిస్తున్న విజయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెలుగమ్మాయి జాహ్నవి దంగేటి పేరు తెగ వైరల్ అవుతోంది. 23 సంవత్సరాల వయస్సులోనే జాహ్నవి దంగేటి సాధించిన సక్సెస్ స్టోరీ ఎంతోమందికి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. జాహ్నవి తన ప్రతిభతో అంతరిక్ష యాత్ర చేసే అవకాశాన్ని అయితే దక్కించుకున్నారు.

జాహ్నవి దంగేటి తన సక్సెస్ స్టోరీ గురించి చెబుతూ  అమ్మమ్మ మాట వల్ల అమ్మమ్మ చెప్పే  పేదరాశి పెద్దమ్మ కథల వల్ల చంద్రునిపై ఆసక్తి  కలిగిందని చెప్పుకొచ్చారు.  చంద్రునిపైకి వెళ్లి  అక్కడ పేదరాశి పెద్దమ్మ ఇచ్చే బహుమతులు  గెలుచుకోవాలనే కోరిక ఉండేదని ఆమె  పేర్కొన్నారు.  పెద్దయ్యాక  ఏమవుతావని ఎవరైనా అడిగితే చంద్రుని దగ్గరకు  వెళ్తానని  చెప్పేదానినని  ఆమె  చెప్పుకొచ్చారు

ఒక పెద్ద  నిచ్చెనతో చంద్రునిపైకి వెళ్తానని చెప్పేదానినని ఆమె కామెంట్లు చేశారు.  అలాంటి నాకు 11 సంవత్సరాల వయస్సులో  నాసా  పరిచయమైంది ఆమె కామెంట్లు  చేశారు.  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన  జాహ్నవి ఆస్ట్రోనాట్ అవ్వాలని చిన్నప్పుడే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు.  16 సంవత్సరాల వయస్సులోనే ఇస్రో  వరల్డ్ స్పెస్  వీక్ లో పాల్గొన్నారు.

పిన్న వయస్సులోనే  జాహ్నవి దంగేటి పిన్న  స్కూబా డ్రైవర్ గా  పని చేశారు.  2022 సంవత్సరం పోలాండ్ లో లూనార్  మిషన్ లో పాల్గొనే అవకాశం అయితే వచ్చింది.  ఐస్ ల్యాండ్ లో జరిపే  జియాలజీ శిక్షణకు ఎంపికైన తోలి భారతీయురాలు జాహ్నవి కావడం గమనార్హం. అంగారకుడిపై అడుగు పెట్టాలని  భవిష్యత్తు అంతరిక్ష ప్రోగ్రామ్స్ లో  దేశం తరపున ప్రాతినిధ్యం వహించడం  లక్ష్యాలు అని జాహ్నవి కామెంట్లు చేశారు.  ఆమె చెప్పిన విషయాలు  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ తరం యువతకు ఆమె రోల్ మోడల్ గా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: