
అయితే ఇప్పుడు తాజాగా స్కూల్ విద్యార్థుల కోసం కొన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల హాజరుకు సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు మాట్లాడుతూ నిన్నటి రోజున సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠశాలకు కచ్చితంగా హాజరు కావాలని సూచించారు టీచర్లు ప్రతిరోజు ఉదయం 9:30 నిమిషాలకే హాజరుకావాలని.. డీఈవోలు, ఎంఈఓ లు, సిఆర్ఫులు, ఏపీసీలు తరచు పాఠశాలన పరిశీలిస్తూ ఉండాలంటూ ఆదేశాలను జారీ చేశారు.
ఎవరైనా ఉపాధ్యాయులు సెలవు పెడితే కచ్చితంగా వారి స్థానంలో మరొక టీచర్ ని నియమించాలంటూ వెల్లడించారు. పదవ తరగతిలో తక్కువ మార్కులు వచ్చే వారికి ప్రత్యేకించి శిక్షణ ఇస్తూ పిల్లలను చదివించాలని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ప్రతి సంవత్సరం కూడా తల్లికి వందనం పథకానికి 70 శాతం వరకు అర్హత ఉండాలి అంటే తెలిపారు.. కొంతమంది ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లను నడుపుతున్నారని ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే ఐచ్చిక సెలవులు కూడా కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని పాఠశాల మొత్తానికి కాదు అంటూ తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థులు మూడు రోజులకు మించి సెలవులు పెడితే తల్లిదండ్రులకు ఫోన్ చేసి అందుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని తెలిపారు విజయరామరాజు. ఐదు రోజుల తర్వాత ఆ విద్యార్థి స్కూల్ కి రాకపోతే..crp,meo లు విద్యార్థి ఇంటికి వెళ్లి కనుక్కోవాలంటూ తెలిపారు.