
రాజకీయాల్లో ఎప్పుడూ ఆవేశం పనికిరాదు.. ఆవేశం విజయాన్ని తెచ్చి పెట్టదు .. ఆలోచనతో పనులు అన్ని చక్కబడతాయి. ఇది తెలియకపోతే ఎలాంటి వాళ్ళు అయినా రాజకీయాల్లో చేతులు కాల్చుకుని బొక్క బోర్లా పడతారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉందిగా. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక - గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముందు పెట్టుకుని ఆంధ్ర వాదం వినిపిస్తున్నారు. ఇక్కడ వాళ్లు ఎలా ? బతుకుతారని ప్రశ్నిస్తున్నారు. మీడియాపై దాడి కోసం ఆంధ్రవాదం తీసుకురావటమే పెద్ద పొరపాటు.. అనుకుంటే దాన్ని రోజు రోజుకు ఆ పార్టీ నేతలు పెంచుకుపోతున్నారు. తెలంగాణ మా జాగిరే అని రెచ్చిపోతుంటే ఇతర పార్టీలు వినోదంగా చూస్తున్నాయి. బిఆర్ఎస్ ఎంత రెచ్చిపోతే తమకు అంత మంచిదని లెక్కలు వేసుకుంటున్నాయి. మీడియాలో తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆంధ్ర మీడియా అంటారు .. ఆంధ్రజ్యోతి పేరు ఉంటే తప్పని బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు వల్ల వారికి రాజకీయంగా లాభం వస్తుందని అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో చాలా ఎఫెక్ట్ పడనుంది.
గ్రేటర్ ఎన్నికలలో కూడా వారికి గతంలో ఉన్న మద్దతు లభించే అవకాశం లేదు సాధారణ ఎన్నికలలో తెలంగాణ వాదం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో బిఆర్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు బిఆర్ఎస్ అధికారంలో ఉంది. తెలంగాణకు ఏం చేయగలమో అంతా చేశామని .. ఇక తమది జాతీయ పార్టీ అని చెప్పిన కేసీఆర్ పార్టీ పేరులో తెలంగాణ తీసేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినందున ఒక ప్రజలు తెలంగాణ సెంటిమెంట్‌కు ఓట్లు వేయరని కెసిఆర్ కు కరెక్ట్ క్లారిటీ ఉంది. అందుకే మన పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు మద్దతు ఇస్తారని పార్టీ పేరు మార్చారు. అయినా కేసీఆర్ లెక్కలు తారుమారు అయ్యాయి..
కానీ జరుగుతోంది వేరుగా ఉంది. ప్రజల్లో సెంటిమెంట్ రాజకీయాలు , ఉద్రేకం సృష్టించే అవకాశాలు లేవు. ఏది ఏమైనా ప్రతిసారి సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు పడతాయి అనుకోవటం భ్రమే అవుతుంది. మరి బిఆర్ఎస్ నేతలు ఈ భ్రమల నుంచి ఎప్పుడు బయటికి వస్తారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు