దేశంలో మరోసారి భూకంపం జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది . ఈ మధ్య కాలంలో మనం ఎన్నో దేశాలల్లో భూకంపం సంభవించింది అనే వార్తలు చదివాం..టీవీలో వాటి రిజల్ట్ చూసాం. అంతేందుకు రీసెంట్ గానే జపాన్ లో భూకంపం ఎలా జనాలను భయపెట్టిందో మనం వీడియోలో రూపమలో కళ్లారా చూసాం . ఇప్పుడు మన ఇండియాలో అదేవిధంగా భూకంపం సంభవించింది . దీంతో ఒక్కసారిగా జనాలు భయపడుతూ ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీసారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


మన దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది . ఢిల్లీ NCR లో బలమైన భూకంపం సంభవించింది అంటూ అధికారులు తెలిపారు.  గురువారం ఉదయం తొమ్మిది గంటల నాలుగు గంటల(9;04) నిమిషాలకు భూమి అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది . మొదటిసారి పెద్దగా భూమి కంపించలేదట. అసలు భూకంపం వచ్చిన్నట్లు కూడా తెలియలేదట. కానీ రెండవసారి మాత్రం భారీ స్థాయిలో భూమి కంపించిందట. దీంతో భూకంపం అని తెలుసుకుని జనాలు అరుస్తూ కేకలు పెడుతూ ఇళ్లల్లో నుంచి బయటకి పరుగులు తీసారు.



భూకంపం తీవ్రత రికార్డ్  స్కేల్ పై 4.1 గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం హర్యానాలోని జజ్జర్‌లో ఉన్నదని తెలిపింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్లలోతులో ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.  ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఝజ్జర్, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి అని తెలుస్తుంది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి అదేవిధంగా ప్రాణనష్టం సంభవించలేదు అంటూ అధికారులు తెలియజేశారు . సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తాము  ఆ సమయంలో ఎలా ఫీలయ్యాము అనేది అక్కడ ఉండే ప్రజలు చెప్పుకొస్తున్నారు. దానికి సమధించిన పిక్స్చర్స్,వీడియోస్ నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఢిల్లీలోని పలు చోట్ల మళ్ళీ భూకంపం సంభవిస్తుంది ఏమో అంటూ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: