
ఈనెల 16న రాజధాని రైతులకు మద్దతుగా అమరావతి రాజధాని గ్రామాలలో కూడా ఆయన పర్యటించబోతున్నట్లు సమాచారం. అమరావతి జేఏసీ నాయకుడిగా పేరు సంపాదించిన కొలికపూడి ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. రాజధాని రైతులకు సైతం అన్యాయం జరిగితే తాను సహించేది లేదని వారికి ద్రోహం చేసినట్టుగా అవుతుందంటూ ఆయన తెలియజేశారు. అందుకే తాను రాజధాని రైతులకు మద్దతుగా ఉంటానని ప్రతి ఊరు తిరిగి ల్యాండ్ ఫూలింగ్ పద్ధతిలో భూములు ఇవ్వవద్దని ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
రాజధానికి ఇచ్చిన భూముల రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఇప్పటికీ పదేళ్లు అవుతున్న వారికి ఎలాంటి న్యాయం జరగలేదు అంటూ ఎమ్మెల్యే కొలికపూడి తెలియజేశారు. రాజధాని అనే పేరుతో తమ పార్టీ వేలాది కుటుంబాలలో విధ్వంసం చేస్తోందన్నట్లుగా మాట్లాడినట్లు వినిపిస్తున్నాయి. తమకు సమాజంలో గౌరవాన్ని గుర్తింపును తీసుకువచ్చిన వారికి ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు. ఇలాంటి సమయాలలో రైతులకు అండగా ఉండకపోతే తన పదవికి తన జన్మకు మాయని మచ్చగా ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు అమరావతికి భూములు కేటాయించిన వారికి ఏ విధంగా ఒరిగిందేమీ లేదని.. ఈ నేపథ్యంలోని రెండో విడతలు బలవంతంగా భూములు తీసుకోవడం పైన చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా తాను ఉన్నట్లుగా తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు వినిపిస్తున్నాయి. మరి టిడిపి ఎమ్మెల్యే చేసిన ఈ తిరుగుబాటు తన సంచలనంగా మారనుంది.