
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వివాదాలు సైతం భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. వరంగల్ యువ డాక్టర్ల కాపురంలో ఇన్ ఫ్లుయెన్సర్ జోక్యం వల్ల ప్రత్యూష అనే డాక్టర్ మృతి చెందడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఇన్ ఫ్లుయెన్సర్ మాయలో పడి ప్రత్యూష భర్త చేసిన చిన్నచిన్న తప్పులే ప్రత్యూష మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాయి.
బాధితురాలి తల్లిదండ్రులు చేస్తున్న ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అవుతున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ గా పని చేస్తున్న సృజన్ 2017 సంవత్సరంలో ప్రత్యూషను పెళ్లి చేసుకున్నారు. ప్రత్యూష డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహించేవారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఒక అమ్మాయి ఈ జంట కాపురంలో చిచ్చు పెట్టింది. రీల్స్ చేసిన అమ్మాయి సృజన్ మధ్య ప్రేమ చిగురించిందని అలా జరగడంతో భార్యాభర్తల మధ్య ప్రేమ శృతి తప్పిందని తెలుస్తోంది. తనను ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త మరో యువతికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రత్యూష అస్సలు తట్టుకోలేకపోయింది. హాసన్ పర్తిలో ఉన్న ఇంట్లో ప్రత్యూష ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
తమ కూతురును విగత జీవిగా చూసిన ప్రత్యూష తల్లీదండ్రులు ఆవేదన అంతాఇంతా కాదు. ప్రత్యూష తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే డాక్టర్ సృజన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రత్యూష మృతికి కారణమైన ఆ ఇన్ ఫ్లుయెన్సర్ ను సైతం అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు