ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంటూ తాజాగా ప్రచారం అయితే జరుగుతోంది. ఎవరు ఉంటారు? ఎవరు ఊడుతారు?ఎవరు కొత్తగా వస్తారు అన్న విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ముగ్గురికి మంత్రి పదవులు పోతాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి కొత్తగా ఎవరు చేరుతారనే విషయంపై పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.. అందులో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లికి చెందినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ, విజయనగరం నుంచి కళా వెంకట్రావు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.



ఈ ముగ్గురు నేతలు కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే.. ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మాత్రం ఈ మధ్య ఎక్కడ వినిపించలేదని చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు ఎప్పుడు గెలిచినా కూడా మంత్రి పదవి ఖాయం అన్నట్టుగా ఉండేది. కానీ 2024 ఎన్నికలలో మాత్రం అలా కనిపించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే గానే ఉన్నారు.



కార్యకర్తలు మాత్రం మార్పు చేర్పులలో తమ నేతకు అవకాశం ఉంటుందంటూ భావిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న ప్రచారంలోని పేర్లలో ఎక్కడా కూడా గంటా శ్రీనివాసరావు పేరు మాత్రం  వినిపించలేదు. గంటా శ్రీనివాసరావు కూడా బలమైన నాయకుడు బలమైన సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది ఈ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఉండడం చేత ఈ ఎమ్మెల్యేకు ఈసారి తక్కువ అవకాశాలు ఉంటాయనే విధంగా వినిపిస్తున్నాయి. తరచూ ఈ మధ్యకాలంలో కూటమినేతలు ఎక్కువగా ఏదో ఒక విషయంలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నేత మాత్రం చాలా తక్కువగా యాక్టివ్ గా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.. మరి కార్యకర్తలు మాట ప్రకారం గంటా మంత్రి అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: