
నాన్ వెజ్ పాలు, డైరీ ఉత్పత్తులు, ఆయిల్, టెక్ సామగ్రి అన్నీ భారత్ మార్కెట్లోకి డంప్ చేయాలని బిగ్ గేమ్ ప్లాన్ చేశారు. కానీ భారత్ వైఖరి అలా లేదు – తల ఊపలేదు.. తలెత్తింది! రష్యాతో ఆయిల్ డీల్ – ట్రంప్ షాక్! .. అమెరికా ప్రయత్నించిన పని ఒక్కటే – రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని బెదిరించడం . కానీ భారత్ తేల్చేసింది – "దేశ ప్రయోజనం ముందు ఎవరూ లేరు" అని! రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, అమెరికా సుంకాల బెదిరింపులపై కూడా స్పందన సూటిగా ఉంది. భారత్ ఏమన్నదంటే – "మేము ప్రతీకారం తీసుకోవడం లేదన్నది అర్థం కాదు. మేము చట్టబద్ధంగా, వ్యాపార సరళినీ చూస్తాం!"
డాలర్ డౌన్ – ట్రంప్ ట్రాక్ అవుట్? .. ఇప్పటికే అమెరికా అనేక దేశాలపై పన్నులు పెంచడంతో, ఆ దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోతోంది. దీని ప్రభావం డాలర్ విలువపై పడే అవకాశం ఉంది. ట్రంప్ విధానాల వల్ల అమెరికా అంతర్జాతీయ స్థాయిలో తన పెద్దదనాన్ని కోల్పోతుందని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. చైనాతో గొడవలు పెట్టుకొని, చివరికి తగ్గిపోయిన ట్రంప్ .. ఇప్పుడు భారత్ పైన అదే పంథాలో వెళ్లి, మరోసారి కాలు తడిపేసుకున్నారు. భారత్ పాలసీ క్లియర్ – దేశ ప్రయోజనమే మొదటి ప్రాధాన్యం! .. ట్రంప్ బెదిరింపులు పని చేయవు. భారత్ ఓ అభివృద్ధి చెందిన శక్తిగా, సంయమనంతో కానీ గట్టిగా అమెరికాకు తగిన బుద్ధి చెబుతోంది.