
గత ఎన్నికలలో టిడిపి పార్టీ నుంచి టికెట్టు కోల్పోయిన వారిలో ప్రభాకర్ చౌదరి ఉన్నారు. చివరికి టిడిపి టికెట్ ని దగ్గుబాటి ప్రసాద్ కు ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం పనిచేశారు ప్రభాకర్ చౌదరి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి నేతల మధ్య వైర్యం మొదలైనట్లుగా వినిపిస్తోంది. తన సొంత నియోజవర్గం అనంతపురం అర్బన్ లో తిరిగి మళ్ళీ రెండవసారి గెలవాలనుకునే ప్లాన్లో ఉన్నారు ప్రభాకర్ చౌదరి. అలా సిట్టింగ్ ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా అనంతపురం అర్బన్ టిడిపి రాజకీయం ఇప్పుడు నడుస్తోంది.
ఇలాంటి సందర్భంలోనే అభివృద్ధి అంశాల పైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పరస్పర విమర్శలకు దారితీస్తుందన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకోవడం మరింత చర్చకు దారితీస్తోంది. కేవలం ఒక ఆసుపత్రి వివాదంలో మొదలైన పాత విషయాలను కూడా తవ్వుకునే పరిస్థితి కనిపిస్తుందట. సిపిఐ నేత రామకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆరోపణలు చేస్తున్నారు.
ఆ తర్వాత ఇద్దరు నాయకులకు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి మరి ఒకరి పైన మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం ఇప్పుడు రాయలసీమలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తనమీదా ఎన్నో కుట్రలు చేస్తున్నారంటూ ఇన్ డైరెక్టుగా ప్రభాకర్ చౌదరి మీద కామెంట్స్ చేస్తున్నారు.. వచ్చే ఎన్నికలలో కూడా తనకే టికెట్ ఇస్తారనే భయం ప్రభాకర్ చౌదరికి పట్టుకుంది.. అందుకే తన మీద బురద జల్లుతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు.
ఇక ఈ విషయం మీద మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి ఇద్దరం పోటీ చేద్దాం ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అంటూ ఒక సవాల్ ను విసురుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే దగ్గుబాటి పైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇలా మొత్తానికి అటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య టికెట్ వైర్యం నడుస్తోంది.