
ఎన్నికలు ఆగిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రేవంత్ రెడ్డి భారీ రాజకీయ ఎత్తుగడ వేశారని, బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ పూర్తి స్థాయి బూత్ కమిటీల సమావేశం నిర్వహించింది. కిషన్ రెడ్డి, రామచంద్రరావు లాంటి కీలక నేతలు హాజరై, పార్టీ శక్తిని మరోసారి రుజువు చేసుకోవాలని పిలుపునిచ్చారు. “హైదరాబాద్ bjp కంచుకోట” అని గుర్తు చేస్తూ, గత ghmc ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకున్నామని నేతలు గట్టిగా గుర్తు చేశారు.
ఈసారి ఉప ఎన్నికలో గెలిచి, నగర రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవడమే లక్ష్యమని స్పష్టమైంది. అంతేకాక, పార్టీకి పనిచేయని కార్పొరేటర్లకు మళ్లీ టికెట్లు ఇవ్వకూడదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. దీంతో bjp లోనూ ఒకరకమైన క్లీనప్ డ్రైవ్ ప్రారంభమవుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. మొత్తానికి, తెలంగాణలో రాబోయే ఈ రెండు ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఒకవైపు రిజర్వేషన్ రాజకీయాలు, మరోవైపు హైదరాబాదులో పట్టాభిషేకం కోసం bjp ప్రయత్నాలు – అన్నీ కలిపి రాష్ట్ర రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి. ఎవరి ఎత్తుగడ ఫలిస్తుందో, ఎవరి బలహీనత బయటపడుతుందో సెప్టెంబర్ వరకూ సస్పెన్స్ కొనసాగనుంది.