ఇటీవలే కాలంలో భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియా అహంకారం అణిచామంటూ విర్రవీగుతున్నారు. ఇందుకు కారణం రష్యన్ చమురును ఇండియా దిగుమతి చేసుకున్నందుకు భారత్ పైన 25% సెకండరీ సుంకాలను సైతం విధించారు అమెరికా ఉపాధ్యక్షుడు. రష్యాను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్   యుద్ధాన్ని ఆపేందుకే సమరశీల ఆర్థిక లివర్ ఏజ్ కింద ఈ సుంకాలను సైతం మోపుతున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారత్ కు కూడా చాలా నష్టం వాటిల్లుతుందని అమెరికా భావిస్తోంది.


రష్యా పై ప్రతి కారం తీర్చుకోవడమే లక్ష్యం అయితే భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి చైనానే చమురుని దిగుమతి చేసుకుంటుంది. కానీ దీని మీద సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు? భారతీయులు. వీటికి తోడు రష్యా నుంచి కొనసాగించడం మంచిదే అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియా కూడా వ్యాఖ్యానించారు. ఇందులో చైనాకు ఒక న్యాయం? భారత్ కు మరొక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు?


ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి భారత్ అండగా ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ఆరోపణలు చేశారు. ఇండియా పైన ఆంక్షలు విధించాలని యూరప్ ను బీసెంట్ కోరారు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు కూడా భారత్ ముప్పు తెస్తుందని భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం  మంచిదని భావించి ట్రంప్ కు వాణిజ్య సలహాదారుడైన పీటర్ నవారో తెలియజేశారు. దీంతో ఉక్రెయిన్  యుద్ధాన్ని మోడీ చేయిస్తున్న యుద్దంగా అభివర్ణించారు . శాంతికి రహదారి న్యూఢిల్లీ గుండానే పడుతుందని దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయిన పట్టించుకోనంటూ ట్రంప్ స్వయంగానే తెలిపారు.


ఇండియా పై 50 శాతం సుఖాలు విధించడంతో చైనాకు ఒక సందేశం లాంటిది ఇవ్వదలుచుకున్నట్లుగా ఉంటుందని , భారత్ కు అనైతికంగా నష్టం కలిగించేలా చేస్తున్నారు. భారత్ పైన విధించిన 50 శాతం టారిఫ్స్ తగ్గించే ఉద్దేశమే లేదంటే ట్రంప్ తెలియజేశారు.. ఎన్నో ఏళ్లుగా భారత్ టారిఫ్స్ చార్జ్ చేస్తోంది.. మనం తెలివి తక్కువగా సుంకాలు వేయకపోవడంతో వారు బిజినెస్ లు చేశారు.. హార్లీ డేవిడ్సన్ వంటి ఎన్నో కంపెనీలను ఇండియాకు వెళ్లాయి. వాటిని తిరిగి రప్పిస్తున్నామని.. కెనడా ,మెక్సికో, చైనా వంటి ప్రాంతాల నుంచి వేల కంపెనీలు వస్తున్నాయంటూ ట్రంప్ తెలిపారు. వీటిని ఒప్పందం కుదుర్చుకోవడం కోసమే ట్రంప్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.



సుంకాలు, చమురు, భౌగోళిక రాజకీయాలను మించిన సంకటన అయినప్పటికీ.. భారత్ ,అమెరికా మధ్య సంబంధాలను ప్రజా సంబంధాలుగా మార్చేలా ట్రంప్ ప్రభుత్వం లక్ష్యం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. HB 1B వీసా విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఈ వీసా వల్ల 70 శాతం మంది భారతీయులే లబ్ధి పొందారు. ఇప్పుడు ఈ విషయం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. కేవలం విద్యార్థుల వీసాలను నాలుగేళ్ల కాలానికి పరిమితం చేయాలని అమెరికా భావిస్తోంది. దీంతో భారతీయ విద్యార్థుల సంఖ్యను కూడా అక్కడ తగ్గింపజేసేలా చూస్తున్నారు. విదేశీ విద్యలలో భారతీయులు పెద్ద వర్గంగా అక్కడ ఉన్నారు. వీరిని తగ్గించి  6 లక్షల మంది చైనా విద్యార్థులను అవకాశం కల్పించేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు.


ఇటువంటి పరిస్థితులలో ట్రంప్ సన్నిహితుడైన సేర్గియో గోర్ భారతదేశంలో అమెరికా కొత్త రాయబారిగా నియమించారు. కానీ ఈయనకు భారతదేశం పట్ల మందస్తు అవగాహన లేదని తెలుస్తోంది. అలాగే దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియో ఉన్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య  యుద్ధం తమవల్లే ఆగిపోయిందని ఒప్పుకోవాల్సిందే అని చెప్పించడానికే ఇలాంటివన్నీ చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే భారతీయులను అమెరికా నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి ధర్నాలు చేస్తున్నప్పటికీ అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గొంతు విప్పకపోవడం మరింత కలవరపాటికి గురిచేస్తోంది. మొత్తానికి ట్రంప్ ఇండియా ని చాలా క్లిష్టమైన పరిస్థితులలో వదిలేసేలా చూస్తున్నారు?.

మరింత సమాచారం తెలుసుకోండి: