తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తి గా జరుగుతోంది. మొత్తం ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని అందరూ భావించారు. కాంగ్రెస్ నుంచి బీసీ అస్త్రం ప్రయోగించారు. నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. నవీన్ గతంలో ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీఆర్ ఎస్ నుంచి దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారా ? అన్న సస్పెన్స్‌కు తెరదించుతూ చివరకు ఆ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకాల దీపక్ రెడ్డినే పోటీలోకి దించింది.
ఇక ఈ రోజు జరిగిన కౌంటింగ్ లో తొలి రౌండ్ మినహా అన్ని రౌండ్ల లోనూ కాంగ్రెస్ తన ఆధిపత్యం చాటుకుంది. ఇప్పటి వరకు చూస్తే కాంగ్రెస్ భారీ మెజార్టీ తో దూసుకు పోతోంది. జూబ్లిహిల్స్ లో 6 వ రౌండ్ ముగిసింది. 6వ రౌండ్ ముగిసే సరికి 15 వేల మెజార్టీ ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ క్రాస్ చేశారు. ఒక్క తొలి రౌండ్ లో మినహా కాంగ్రెస్ పార్టీ కి బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎక్కడా పోటీ ఇవ్వలేదు. వార్ వన్ సైడ్ అన్నట్టుగా దూసుకు పోయింది. మొత్తం 10 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ మెజార్టీ 25 - 30 మధ్యలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి