కేంద్రంలో ఇప్పటి వరకు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటి వరకు ఎన్నో సంచలనాలకు కేంద్ర బింధువుగా ఉన్న స్వామి ఆ మద్య రఘరాం రాజన్ పై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   తాజాగా రఘురాం రాజన్ విషయంలో ఆయనకు దేశం మద్దతు తెలిపే విధంగా బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ద్రవ్య పరపతి పాలసీ విషయంలో రఘురాం రాజన్ మీద ఆయన మండిపడ్డారు.

గతంలో  ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ కొట్టిపారేశారు.   నిత్యం ఏదో ఒక విషయంలో పలువురి పై ఆరోపణలు చేసే సుబ్రమణ్య స్వామి ఈ సారి ఒక నెల రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ఆర్ బీఐ గవర్నర్ రఘురాం మీద మరో సారి మాటల తూటాలు పేల్చారు.

'వడ్డీరేట్లను పెంచడం ద్వారా రాజన్‌ భారత ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నారని, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకుల రుణాలు పొందడం అసాధ్యంగా మార్చారని ఆయన అబిప్రాయపడ్డారు. అంతే కాదు మీడియా తనను రాక్షసుడిగా చిత్రిస్తున్నదని విషాదం వ్యక్తం చేస్తూ.. మీడియాపై స్వామి మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: