మన హైదరాబాద్ అమ్మాయి సైనా చరిత్ర సృష్టించింది. భారత క్రీడారంగం జెండా రెపరెపలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. ఏకంగా బ్యాడ్మింట్ ప్రపంచ సామ్రాజ్జిగా ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సైనా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. తొలిసారిగా సైనా టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. 

సైనా రికార్డులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన తొలి మహిళా షట్లర్‌గా సైనా రికార్డు కెక్కింది. ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన తొలి భారతీయురాలిగానూ చరిత్ర సృష్టించింది. ఇండియా ఓపెన్‌ సెమీస్‌లో కరోలినా మారిన్‌ ఓటిమి చెందడంతో సైనా నెహ్వాల్‌ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గతంలో ప్రకాశ్‌పదుకొనె పురుషుల బాడ్మింటన్‌లో నంబర్‌ వన్‌ స్థానం సాధించారు.

తన ప్రతిభతో సైనా చైనా క్రీడాకారుల ఆధిపత్యానికి గండికొట్టగలిగారు. ప్రపంచ బ్యాడ్మింటన్ రో సైనాకు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు ఖాయమైనా.. అధికారికంగా వచ్చే గురువారం ఈ ఫలితాన్ని ప్రకటిస్తారు.  సైనా కొన్నేళ్లుగా వరుస విజయాలు అందిస్తూ.. దేశం పరువును కాపాడుతున్నారు. 

సైనా ఒలింపిక్స్ పతకం సాధించిన వేళ భారతమంతా మురిసింది. సూపర్ సీరిస్ నెగ్గింది.. ఎన్నో ఓపెన్ లు గెలుచుకుంది. ఆటలో ఒడిదుడుకులు ఎదురైనా ధృఢ చిత్తంతో ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకుని సత్తా చాటింది. దాదాపు ఐదేళ్ల క్రితమే ప్రపంచ నెంబర్ 2 స్థానం సంపాదించుకున్న సైనా.. ఆ తర్వాత క్రమంగా పట్టుకోల్పోయింది. అయినా నిరాశ చెందకుండా పట్టువిడవకుండా మళ్లీ పైకెగసి ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవడం.. నిజంగా ఓ వ్యక్తిత్వ వికాసపాఠమే.. కాదంటారా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: