అనగనగా ఒక అడవి దగ్గర ఒక పక్క పల్లెలో ఒక కాకి నివసిస్తూ ఉండేవి. మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు ఆ అడవి మొత్తం తిరిగి వచ్చేది. ఒకసారి కొలనులో వున్న హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస.. దీని అంత సంతోషంగా మరే పక్షి ఉండదు.. నేను ఉన్నాను ఎందుకు.. అని అనుకొనేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది కాకి..

నేను కూడా నీలాగే అనుకుని గర్వపడేదాన్ని.. చిలుకను చూశాక నా ఆలోచన తప్పని తెలుసుకున్నాను అని చెప్పింది హంస. శరీరమంతా ఆకుపచ్చ  రంగు, ముక్కంతా ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అని, అంది హంస.. అప్పుడు చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటలు  చెప్పింది.. చిలక.. నేను కూడా అలా మురిసిపోయే దానిని..ఒక్కసారిగా నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది. నాకు కేవలం రెండు రంగులు ఉన్నాయి ..కానీ నెమలికి ఎన్ని రంగులు  ఉంటాయో  కదా..! అంది చిలుక.. కాకి నెమలిని  కలిసి ఈ మాట  చెప్పాలి.. అని అనుకుంది.


అడివంతా తిరిగినా.. ఎప్పటికీ ఎక్కడ నెమలి కనిపించలేదు. ఒకసారి అది  ఊరికి దగ్గర్లో ఉన్న ఒక జూ లో  నెమలిని చూసింది.. దాని వద్దకు వెళ్లి పక్షులు  అన్నింటిలో అందం అంటే నీది.. మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అప్పుడు నెమలి ముఖం దీనంగా పెట్టి ..నా అందం  వల్లే నేను ఇక్కడ బందీ అయ్యాను.. అడవిలో ఉన్నంతవరకు వేటగాళ్ళ కు భయపడుతూ, దాచుకుంటూ తిరగాల్సి వచ్చేది ..చివరికి వాళ్ల చేతికి చిక్కి పడ్డాను.. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది.

ఇక్కడ దాదాపుగా అన్ని పక్షులను బందీలుగా పెట్టారు ఒక్క మిమ్మల్ని తప్ప. నేనే కనుక కాకిని  అయితే నీలా స్వేచ్ఛగా తిరిగే దాన్ని కదా.. అని అన్నది నెమలి. ఇక నెమలి మాటలు విన్న కాకి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా జీవిస్తూ గడప సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: