మీ భాగస్వామిని ప్రాణంగా ప్రేమిస్తున్నారా ? కానీ వ్యక్త పరిచే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురుకొంటూ ఉన్నారా ? ఎంతటి ఖరీదైన గిఫ్ట్ కొన్నప్పటికీ పరిస్థితి మెరుగుపడ్డం లేదా? మీ ప్రేమ ని చెప్పడానికి మాటలు, వస్తువులూ చాలడం లేదా ? అన్నిటికంటే దృడమైన విధంగా మీ ప్రేమని చెప్పగలిగిన సాధనం "కౌగిలింత" అని చెబుతున్నారు నిపుణులు. ఉరుకుల పరుగుల జీవన విధానం లో భాగస్వామి మీద మనకి ఉన్న ప్రేమ ని తెలియజేసే విధానం ఇంతకంటే మరొకటి లేదట మరి .. "కౌగిలింత వాళ్ళ కలిగే ఏడు లాభాలు " వాటి  వివరాలు చూడండి

 

- రోజుకి ఒక్క సారి కంటే ఎక్కువ సార్లు కౌగిలించుకోవడం ద్వారా శరీరంలో నుంచి  సెరటోనిన్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది, ఇది శరీరాన్ని చాలా ఎఫెక్టివ్ గా ఉత్తేజపరుస్తుంది.

 

- మీకూ మీ భాగస్వామి కీ మధ్య ఏదైనా ఊహించని గొడవ జరిగినప్పుడు, ఆమె/అతడు అలిగినపుడు సారీ చెప్పడానికి మీకు అహంకారం గనక అడ్డం వచ్చిన సమయంలో ఈ కౌగిలింత మిమ్మల్ని చాలా చాకాచాక్యంగా కాపాడుతుంది . ఎంత పెద్ద గొడవ తరవాత అయినా అనుకోకుండా భాగస్వామికి ఇచ్చిన కౌగిలింత ఇద్దరి మధ్యనా ఉన్న చాలా గొడవలు తగ్గిస్తుంది. ' ఇగో ' అడ్డం వచ్చినప్పుడు ఈ పని చేసేయండి మరి.

 

- శృంగారానికి మొదటి స్టెప్ కౌగిలింత అని చెబుతున్నారు విశ్లేషకులు, ఒక్క కౌగిలింత తో విడుదల అయ్యే హార్మోన్ లు శరీరాన్ని శృంగారానికి సిద్దంగా పెట్టి, " నేను నీతో శృంగారం కోరుకుంటున్నాను" అనే సందేశం భాగస్వామి శరీరానికి అందిస్తాయి ..

 

- ఒక్క కౌగిలింత మీ ఇద్దరిలోనూ బ్లడ్‌ప్రెజర్‌, ఒత్తిడినీ తగ్గిస్తుందని న్యూయార్క్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధన వెల్లడించింది.



 ఒక్క కౌగిలింత డాక్టర్ ని ఆమడు దూరంలో పెడుతుందట



- రోజుకి ఒక యాపిల్ , డాక్టర్ ని దూరంగా పెట్టండి అనే నానుడి లాగా రోజుకు ఒక్క కౌగిలింత డాక్టర్ ని ఆమడు దూరంలో పెడుతుందట

 

- కౌగిలింత చాలా ఎక్కువగా ధైర్యాన్ని కలిగిస్తుందట. " నేను నీకు ఉన్నాను " అనే భరోసాని అందిస్తుంది. రోజూ వేలైనన్ని సార్లు ఈ భరోసా ని కలిపించండి మరి

 


మరింత సమాచారం తెలుసుకోండి: