టి20 ఫార్మాట్ అంటేనే అటు ఎన్నో అద్భుతాలకు మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక టి20 ఫార్మాట్లో ఆడే ప్రతి ఆటగాడు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాడు. పరుగులను కట్టడి చేయడానికి ఫీల్డర్లు.. ఇక పరుగులు చేయడానికి బ్యాట్స్మెన్లు.. వికెట్లు పడగొట్టడానికి బౌలర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా తమలో దాగి ఉన్న అత్యుత్తమ ప్రతిభను బయటపెడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇక టి20 ఫార్మాట్లో ఉండే అద్భుతాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. ముఖ్యంగా ఇక అటు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేసే ఫీల్డర్లు మెరుపు క్యాచ్ పట్టడం అటు అందరిని కూడా అవాక్కయ్యేలా చేస్తుంది.


 ఇలా ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా ఆటగాళ్లు బౌండరీ దగ్గర అసమాన్యమైన రీతిలో ఫీల్డింగ్ చేసి ఆకట్టుకున్నారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఐర్లాండ్ ఫీల్డర్ ప్రాణాలకు తెగించి మరి ఫీల్డింగ్ చేసి పరుగులను కట్టడి చేసిన విధానం అందరిని అవ్వక్కయ్యేలా చేసింది. ఇటీవల ఐర్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 14 ఓవర్లో అప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 113 పరుగులు చేసింది.


 ఇక అప్పుడు క్రీజులో మార్కస్ స్టోయినిస్, ఫించ్  ఉన్నారు. అయితే మార్క్ హైదర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక భారీ బౌండరీ కోసం స్టోయినిస్ బంతిని బలంగా కొట్టాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మేక్ కార్తీ తన అద్భుతమైన ఫీల్డింగ్ తో అందరిని మెప్పించాడు. ప్రాణాలకు తెగించి మరీ బౌండరీని ఆపేసాడు. ఇక అతని మెరుపు ఫీల్డింగ్ కి ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయి చప్పట్లతో ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. ఇక స్టేడియంలోని ప్రేక్షకులు అయితే జోహార్లు చేశారు. అయితే మెరుపు ఫీల్డింగ్ చేయడం కారణంగా గాయపడిన అతను కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: