
ఇలాంటి సమయంలో అటు ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో ఎప్పుడు కీలక పాత్ర పోషించే జస్ ప్రీత్ బూమ్రా గాయం కారణంగా ఇక ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇది మాత్రం అటు ముంబై ఇండియన్స్ కు తీరని లోటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెనునొప్పి గాయం కారణంగా గత కొన్ని నెలల నుండి క్రికెట్ కు దూరంగా ఉంటున్న ఐపీఎల్ కు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇదే విషయంపై మాట్లాడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బూమ్రా సేవలను కోల్పోవడం నిజంగా మాకు భారీ ఎదురు దెబ్బ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
జట్టులో బూమ్రా లేని లోటును ఎవరూ తీర్చలేరు అంటూ తెలిపాడు. అయితే యువకులకు అవకాశం ఇచ్చేందుకు ఇక తాము సిద్ధంగా ఉన్నాం అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అలాగని యువకులపై ఒత్తిడి పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోము అంటూ తెలిపాడు. అర్హులైన వారికి తప్పకుండా అవకాశాలు ఇస్తాం అంటూ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా ఏప్రిల్ రెండవ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. కాగా ముంబై ఇండియన్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుంది... ఆరోసారి కప్పు గెలుచుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.